
అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ముందుగానే ఒంట్లో కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఊహకందని నష్టాలు కలిగిస్తుంది. అందుకు రోజూ తీసుకునే ఆహారంలో ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి.

నేటి కాలంలో దాదాపు అందరూ కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. పలు గుండె సంబంధిత వ్యాధులకు కొలెస్ట్రాల్ ప్రధాన కారణం. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల అనేక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.

మీరు మీ ఒంట్లో కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలనుకుంటే, ముందుగా కొన్ని మార్పులు చేసుకోవాలి. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ ఆహారంలో నూనె పదార్ధాలను తొలగించుకోవాలి.

మీకు కొలెస్ట్రాల్ సమస్యలు ఉంటే అల్పాహారంలో ఎక్కువ ఓట్స్ తినడంపై దృష్టి పెట్టాలి. ఓట్స్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కొవ్వు చేపలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. వీటిని భోజనంలో చేర్చుకావాలి.

బాదం, వాల్‌నట్‌లు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అందువల్ల వాటిని కూడా ఎక్కువగా తినడంపై దృష్టి పెట్టాలి. ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.