కూరగాయలు: డయాబెటిక్ పేషంట్లు షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేసేందుకు అన్ని రకాల ఆహారాలను పరిమితిగా తీసుకోవచ్చు. ఇందులోని పోషకాలు మీ రక్తంలో చక్కెరను తగ్గించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడతాయి.
సాధారణంగా, రోజుకు 5 నుండి 7 బాదంపప్పులు తినడం మంచిది. చాలా బాదంపప్పులు మీ ఆరోగ్యానికి సురక్షితమైనవి మరియు ప్రయోజనకరమైనవి. బాదంపప్పును ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి వాటిని సరైన మోతాదులో తీసుకోవడం చాలా ముఖ్యం.
ఓట్స్: శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో ఓట్స్ మెరుగ్గా పనిచేస్తాయి. తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అయితే ఈ ఓట్స్ శరీరంలోని షుగర్ లెవెల్స్‌ను కూడా నియంత్రించగలవు.
చేపలు: సమస్య ఏదైనా చేపల కూర ఆరోగ్యాన్ని కాపాడడంలో మెరుగ్గా పనిచేస్తుంది. ఇక డయాబెటిక్‌తో బాధపడువారికి చేపలు చాలా మంచి పోషకాహారం. ఒమేగా-3 ఫాటీ ఆసిడ్లను పుష్కలంగా కలిగి ఉండే చేపలు మీ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను స్థిరంగా ఉంచుతాయి.
బెర్రీస్: కార్బోహైడ్రేట్స్ తక్కువగా.. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే బెర్రీలు మధుమేహులకు చాలా మంచిది. ఇవి శరీర ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.