
ఈ ఐదు వంటింటి చిట్కాలు మీకు తెలుసా..?


అన్నం వండటానికి చాలా నీరు ఉపయోగిస్తాం. ఒకోసారి నీరు ఎక్కువైనప్పుడు అన్నం చిమిడి పోతుందని భయపడతాం. అలాంటి సమయంలో అన్నం పాత్రలో నాలుగు నుంచి ఐదు బ్రెడ్ ముక్కలు వేస్తే అన్నంలో ఉండే అధిక నీటిని అవి పీల్చుకుంటాయి. అనంతరం వాటిని తీసేస్తే సరి.

ఉప్పు డబ్బాలో సులువుగా మాయిశ్చర్ పట్టేస్తుంది. ఇలాంటి సమయంలో డబ్బా చూడడానికి బాగా ఉండదు. అయితే ఉప్పు డబ్బాలో కొన్ని బియ్యం వేస్తే మాయిశ్చర్ ను పీల్చేసుకుంటాయి.

కుక్కర్ లో ఏది వండినా దాని నుంచి నీరు బయటకు వచ్చి గ్యాస్ స్టౌ అంతా పాడైపోతుంది. ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి కుక్కర్ మూత పెట్టే ముందు కుక్కర్ లో చిన్న గిన్నె పెడితే నీరు బయటకు రావు. అయితే కుక్కర్ రబ్బర్ పాతబడడం వల్ల కూడా నీరు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఓ సారి చెక్ చేసుకోండి.

Garlic