
రాశుల కలయిక, సంచారం వలన రాజయోగాలు ఏర్పడుతాయి. అయితే జూన్ 24న మిథునలోకి సూర్యుడి సంచారం, అప్పటికే అందులో గురువు ఉన్నందున రెండు గ్రహాల కలయికతో గురు ఆదిత్య రాజయోగం ఏర్పడుతుంది. అలాగే మిథున రాశిలో బుధుడు బుధాత్య రాజయోగం ఏర్పరచగా, మిథున రాశిలోకి సూర్య, చంద్రులు శశిఆదిత్య రాజయోగం ఏర్పరుస్తున్నారు. ఇలా గ్రహాల కలయిక వలన మూడు రాజయోగాలు ఏర్పడనున్నాయి. దీంతో ఇది ఓ శక్తివంతమైన త్రయోదిత్య రాజయోగం ఏర్పడుతుంది. అయితే ఇది పలు రాశుల వారికి అనుకోని లాభాలు తీసుకరానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

మిథున రాశి : మిథున రాశి వారికి త్రయోదిత్య రాజయోగం వలన పట్టిందల్లా బంగారమే కానుంది. వీరు చాలా ఆనందంగా గడుపుతారు. కుటుంబంతో కలిసి దైవదర్శనాలు చేస్తారు. ఇది మీకు మంచి మనశ్శాంతిని ఇస్తుంది. అంతేకాకుండా దైవ దర్శనం మీ కుటుంబంలోకి ఓ శుభ వార్తను తీసుకొస్తుంది. దాంతో మీరందరూ చాలా ఆనందంగా ఉంటారు. వ్యాపారస్తులకు,రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి , వైద్య వృత్తిలో ఉన్నవారికి కూడా ఇది అనేక ప్రయోజనాలను చేకూరుస్తుందని చెబుతున్నారు పండితులు.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి మూడు రాజయోగల ఏర్పాటు వీరి జీవితంలో ఆనందాన్ని, శ్రేయస్సును తీసుకొస్తుంది. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇంటిలో శుభకార్యం చేస్తారు. మీ సంతానంలో ఒకరు ఉద్యోగం సాధించడంతో చాలా ఆనందంగా గడుపుతారు. అంతే కాకుండా సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దీంతో కుటుంబంతో కలిసి ఆనందంగా జీవిస్తారు. వ్యాపారస్తుంలు పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. ఎందుకంటే అత్యధిక లాభాలు పొందే ఛాన్స్ ఉంది.

మీన రాశి : మీన రాశి వారికి త్రయోదిత్య రాజయోగం వల అదృష్టం కలిసి రావడమే కాకుండా పట్టిందల్లా బంగారమే కానుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. అప్పులన్నీ తీరిపోయి ఆనందంగా ఉంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. చేతినిండా డబ్బే కనిపించడంతో చాలా సంతోషంగా ఉంటారు. అలాగే వీరు ఏ పని చేసినా అందులో విజయం వీరిదే అవుతుంది. విద్యార్థులకు కలిసి వచ్చే సమయం. విదేశీ ప్రయాణాలు అద్భుతంగా ఉంటాయి.

మీన రాశి : అలాగే చాలా రోజుల నుంచి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు, పెట్టుబడి దారులకు, రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ పొందుతారు. సంఘంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.