- Telugu News Photo Gallery These are the zodiac signs that will be lucky under the influence of Saturn
శని ప్రభావంతో కొటీశ్వరులు కాబోయే రాశుల వారు వీరే
జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహం చాలా శక్తివంతమైన గ్రహంగా పరిగణిస్తారు. అయితే గ్రహం సంచారం లేదా తిరోగమనం వలన 12 రాశులపై దీని ప్రభావం పడుతుంది. అయితే అతి త్వరలోనే శని తిరోగమన దశలోకి మారబోతున్నాడు. దీంతో ఐదు రాశుల వారికి అదృష్టం కలగనుంది. కాగా,ఆ రాశుల ఏవో. ఏరాశుల వారికి ఆర్థికంగా కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం
Updated on: May 31, 2025 | 10:28 PM

మిథున రాశి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని గ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంటది. అయితే దీని వలన మిథున రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. సంపద రెట్టింపు అవుతుంది. చాలా రోజుల నుంచి వసూలు కాని మొండి బాకీలు వసూలు అవుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆర్థిక పురోగతి ఉంటుంది. కొత్త వరనరుల నుంచి డబ్బు సంపాదిస్తారు.

మీన రాశి : శని తిరోగమన దశ వలన మీన రాశి వారిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. దీని వలన ఈ రాశి వారికి వ్యాపారం బాగుంటుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్న వారికి కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారు జాబ్ కొడుతారు.

వృశ్చిక రాశి : శని తిరోగమనం వలన వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. వీరి ఆస్తులు పెరుగుతాయి. ఉద్యోగం చేసేవారు మీ పై ఉన్నవారి నుంచి ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

ధనస్సు రాశి : శని ప్రభావం వలన ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఈ రాశిలోని వారు అత్యధిక లాభాలు పొందుతారు. అంతే కాకుండా అమ్మకాలు పెరుగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. మీరు ఎందులో పెట్టుబడి పెట్టినా మీకు మంచి రాబడి రావడం ఖాయం. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. చాలా ఆనందంగా గడుపుతారు.

కుంభ రాశి : శని సంచారం లేదా శని గ్రహం తిరోగమనం వలన కుంభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఏపని చేసినా విజయం వీరి సొంతం అవుతుంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొటుంది.



