పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఈ లక్షణాలు కనిపిస్తే వడదెబ్బ తగిలినట్లే!

Edited By:

Updated on: Mar 03, 2025 | 9:40 PM

ఎండలు మండి పోతున్నాయి. మార్చి నెల ప్రారంభంలోనే సూర్యుడు తన ప్రతాపం చూపెడుతున్నాడు. భానుడి భగ భగలు, వేడి గాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే ఎండ తీవ్రత పెరగడంతో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మరీ ముఖ్యంగా కొన్ని లక్షణాలు కనిపిస్తే తప్పకుండా వైద్యులను సంప్రదించాలంట. అవి ఏవి అంటే?

1 / 5
అప్పుడే ఎండకాలం మొదలైపోయింది. మార్చి మొదటి వారంలోనే భానుడి భగ భగలకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విపరీతమైన వేడిగాలులు, ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.

2 / 5
అందువలన ఎవరైనా సరే చిన్నపని మీద బయకు వెళ్తే వాటర్ బాటిల్, ముఖానికి స్కార్ఫ్ లేదా సన్ గ్లాసెస్ వాడాలని చెబుతున్నారు. అంతే కాకుండా బయటకు వెళ్లే ముందు తప్పకుండా శరీరానికి కావాల్సినంత నీరు తీసుకోవాలంట. ఎందుకంటే వడదెబ్బ తగిలితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

3 / 5
అయితే మిట్టమధ్యాహ్నం వేళ గనుక మీరు బయటకు వెళ్లి వచ్చిన తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే వడదెబ్బ తగిలినట్లేనంట. కాగా, వడదెబ్బ తగిలితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో చూద్దాం.

4 / 5
వడదెబ్బ తగిలితే ఆ వ్యక్తి కళ్లు తిరగడం, మూర్ఛపోవడం, వాంతులు, కడుపు నొప్పి, వికారం, విపరీతమైన తలనొప్పి, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయంట. అంతేకాకుండా అతిగా దాహం వేసినట్లు కూడా అనిపిస్తుందంట.

5 / 5
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. లేకపోతే ప్రాణం ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు. అలాగే వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లటి గాలి తగిలే ప్రదేశంలో ఉంచాలంట. అలనికి చల్లటి నీరు ఇవ్వాలి, బిగుతుగా ఉండే డ్రెస్ ఉంటే దానిని విప్పేసి తేలికపాటిదుస్తులు వేయాలంట.

Follow Us