
అయితే ఒకప్పుడు ప్రతి ఒక్కరూ పసుపు తాడు మాత్రమే ధరించారు. కానీ ఇప్పుడు చాలా మంది బంగారు గొలుసును తాళిగా ధరిస్తున్నారు. పసుపు దారం ధరించడం కంటే బంగారు గొలుసు ధరించడం సులభం, ఎందుకంటే పసుపు దారంపై త్వరగా మురికి చేరుతుంది. అది త్వర త్వరగా పాడైపోయి, పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే చాలా మంది బంగారు గొలుసును మాత్రమే తాళిగా ధరిస్తున్నారు.

ఇక తాళిని ప్రతి మహిళ చాలా పవిత్రంగా భావిస్తుంది. అయితే తాళికి చాలా మంది మహిళలు సేఫ్టీ పిన్నులు ఉంచుతారు. ముఖ్యంగా అమ్మమ్మలు, నాన్నమ్మల మంగళ సూత్రాలకు తప్పకుండా పిన్నులు ఉంటాయి. కానీ ఇలా మంగళసూత్రానికి అస్సలే సేఫ్టీ పిన్నులు పెట్టకూడదంటున్నారు పండితులు. దీని వలన కలిగే సమస్యలు ఏవో ఇప్పుడు మనం చూద్దాం.

పవిత్రమైన మంగళసూత్రానికి సేఫ్టీ పిన్నులుపెట్టడం వలన ఇది భర్త పురోగతికి అడ్డంకిగా మారుతుందంట. అదే విధంగా తన ఆదాయానికి ఆటంకం కలిగిస్తుందని చెబుతున్నారు పండితులు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో మహిళలు తమ మంగళసూత్రానికి సేప్టీపిన్నులు ధరించకూడదంట.

సేఫ్టీ పిన్నులతో పాటు ఇనుముతో చేసిన వేటిని కూడా తాళికి జత చేయకూదంట. ఎందుకంటే ఇనుము అనేది శని దేవుడికి సంబంధించిన లోహం. దీనిని మంగళసూత్రానికి జత చేయడం వంలన ఇంట్లో ప్రతి కూల శక్తి పెరగడమే కాకుండా, బంధంలో కూడా చీలకలు ఏర్పడే ప్రమాదం ఉన్నదంట.

(నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)