థైరాయిడ్ పేషెంట్స్ ఏం తినాలో, ఏం తినకూడదో తెలుసా?

Updated on: Jul 24, 2025 | 9:58 AM

ప్రస్తుతం థైరాయిడ్ సమస్య అనేది చాపకింద నీరులా వ్యాపిస్తుంది. చాలా మంది మహిళలు ఈ వ్యాధితో సతమతం అవుతున్నారు. ఈరోజుల్లో 18 సంవత్సరాలు నిండని వయసు పిల్లల్లో కూడా ఈ సమస్య ఉంది. దీంతో ఈ వ్యాధి ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఎలాంటి ఆహారం తీసుకోకూడదో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికోసమే ఈ సమాచారం. ఇప్పుడు మనం థైరాయిడ్ ఉన్న వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకోకూడదో చూద్దాం.

1 / 5
శరీరంలో థైరాయిడ్ అనేది చాలా కీలకమైన గ్రంథి. హర్మోన్ల అసమతుల్యత వలన ఇది ఏర్పడుతుంది. దీని వలన శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి.  కొందరు అతిగా బరువు పెరగడం, మరికొందరు వేగంగా బరువు తగ్గడం, అలసట , నిద్రలేమి వంటి అనేక సమస్యలు ఎదురు అవుతుంటాయి.

2 / 5
 అయితే థైరాయిడ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి హైపో థైరాయిడిజం, రెండోది హైపర్ థైరాయిడిజం.  హైపోథైరాయిడ్‌లో తక్కువ హార్మోన్స్ ఉత్పత్తి అవుతే, హైపర్ థైరాయిడ్‌లో ఎక్కువ హర్మోన్స్ ఉత్పత్తి అవుతుంటాయి. హైపోథైరాయిడ్ లక్షణాలు : అలసట, మలబద్ధకం, శరీరం పొడిబారడం, అతి నిద్ర , నెలసరి తక్కువ అవ్వడం, చలిని తట్టుకోలేకపోవడం, జుట్టు రాలడం, గుండె అధికంగా కొట్టుకోవడం.

3 / 5
హైపర్ థైరాయిడ్  లక్షణాలు : ఆందోళన, నిద్రలేమి, అలసట, నెలసరిలో మార్పులు, కళ్లు పెద్దగా మారడం, త్వరగా బరువు తగ్గడం, వేడిని తట్టుకోలేకపోవడం, అతిసారం, వణుకు, కండరాల బలహీనత, ఎక్కువ చెమటుల పట్టడం,జుట్టు రాలడం,  థైరాయిడ్ గ్రంథి వాపు, అతిగా ఆకలి, నీరసం వంటి లక్షణాలన్నీ హైపర్ థైరాయిడిజం లక్షణాలే. అయితే థైరాయిడ్ ఏది అయినా సరే జింక్, సెలీనియం వంటి విటమిన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. కాగా, ఇప్పుడు మనం తీసుకోకూడని, తీసుకోవాల్సిన ఫుడ్ ఏదో చూద్దాం.

4 / 5
థైరాయిడ్ ఆరోగ్యం కోసం  అయోడిన్ లోపం హైపోథైరాయిడిజానికి కారణం కాబట్టి, అయోడైజ్డ్ ఉప్పు మీ వంటల్లో ఉపయోగించాలి. అలాగే చేపలు, రొయ్యలు, వాల్ నట్స్, గుడ్లు, తృణధాన్యాలు, పొద్దు తిరుగుడు విత్తనాలు ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే పాలు పెరుగు, గుమ్మడి గింజలు, పప్పు ధాన్యాలు, జున్ను , సోయా , గుడ్లు, చికెన్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలంట, అంతే కాకుండా జీర్ణక్రియ సమతుల్యంగా ఉండటానికి తగిన నీరు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.

5 / 5
థైరాయిడ్ ఉన్న వారు బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, ముల్లంగి , టర్నిప్ వంటి కూరగాయలు తినకూడదు, అలాగే సోయా, అధిక చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు, కెఫిన్, టీ, కాఫీ, ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదంట.( నోట్ : ఇది ఇంటర్నెట్ సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది, టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)