పెద్ద వాళ్లతో పోల్చితే పిల్లలో ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువా ఉండటం వల్ల త్వరగా జబ్బుల బారిన పడుతూ ఉంటారు. అందులోనూ వింటర్ సీజన్‌లో మరింత కేర్ అవసరం. త్వరగా జలుబు, దగ్గు, జ్వరం వంటివి ఎటాక్ చేస్తాయి.
ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం పెట్టాలి. వింటర్ సీజన్‌లో పెద్ద వారికే కాదు పిల్లలకు కూడా ప్రత్యేకమైన ఫుడ్ అవసరం. మరి పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలో తెలుసుకోండి.
పిల్లలకు ఇవ్వాల్సిన ఆహారాల్లో ముందుగా ఉండేది బెల్లం. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. బెల్లం తినడం వల్ల అనేక పోషకాలు పిల్లలకు అందుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల త్వరగా జబ్బుల బారిన పడకుండా ఉంటారు.
క్యారెట్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. క్యారెట్‌లో ఉండే అనేక పోషకాలు.. పిల్లలకు అందుతాయి. దీంతో బలంగా ఉంటారు. పసుపు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపు కలిపిన పాలు వంటివి పిల్లలకు ఇవ్వడం వల్ల త్వరగా జబ్బులు దరి చేరకుండా ఉంటాయి.
అదే విధంగా ఉసిరి కాయ ఇవ్వడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పలు రకాల కూరగాయలతో చేసిన ఫుడ్స్ ఇవ్వడం వల్ల కూడా మంచి పోషకాలు అందుతాయి. బాదం, జీడిపప్పు, వాల్నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్, గింజలు ఇస్తే పిల్లల కండరాలు బలంగా మారతాయి.