
ఛాయ్ అన్నింటికి మెడిసిన్. చిరాగ్గా ఉన్నా.. కాస్తా పని ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందాలన్నా ఓ ఛాయ్ తాగాల్సిందే. అయితే ఛాయ్ రెగ్యులర్‌గా తాగేవాళ్లకు కొన్ని సూచనలు చేస్తున్నారు ఆరోగ్య నిపుణులు. టీ ఎక్కువగా మరిగించకూడదని సూచిస్తున్నారు. ఇందుకు రీజన్స్ కూడా చెబుతున్నారు.

టీని పాలతో కలిపి తాగడం వల్ల మన బాడీకి లభించే ఎనర్జీ.. చాలాసేపు మరగబెట్టినప్పుడు నశిస్తుందట. అలాగే ఛాయ్‌లో టానిన్లు అనే సహజ రసాయనాలు ఉంటాయి. టీని ఎక్కువసేపు మరిగించడం వల్ల వాటి సాంద్రత పెరిగి బాడీపై వ్యతిరేక ప్రభావం చూపుతాయంటున్నారు. దీని కారణంగా శరీరం ఐరన్‌ను గ్రహించలేకపోతుందట. అంతేకాదు.. మరికొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయట.

టీని ఎక్కువసేపు మరిగించడం వల్ల పెరిగిన టానిన్ల సాంద్రత జీర్ణ సమస్యలకు దారితీస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా అధిక టానిన్లు తీసుకోవడం వల్ల వికారం, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు రావొచ్చంటున్నారు. ఛాయ్‌ని ఎక్కువసేపు మరిగించడం వల్ల ఏర్పడే కొన్ని రసాయనాలు క్యాన్సర్ కారకాలను ప్రోత్సహిస్తాయట.

ఛాయ్‌ని ఎక్కువసేపు మరిగించడం వల్ల ఏర్పడే కొన్ని రసాయనాలు క్యాన్సర్ కారకాలను ప్రోత్సహిస్తాయట. 2013లో "Nutritional Research" అనే జర్నల్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. టీని ఎక్కువసేపు మరిగించడం వల్ల జీర్ణ సమస్యలు, ఐరన్ లోపానికి దారితీస్తుందని కనుగొన్నారు. ఈ రీసెర్చ్‌లో బీజింగ్‌లోని చైనా వైద్య విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ యువాన్ పాల్గొన్నారు.

ఎక్కువసేపు టీ మరిగించడం వల్ల ఏర్పడే టానిన్లు శరీరంలో ఐరన్ సంగ్రాహాన్ని అడ్డుకుంటాయని, జీర్ణ సమస్యలు కలిగిస్తాయని ఆయన వెల్లడించారు. టీని ఎక్కువసేపు మరిగించడం వల్ల పాలలోని కాల్షియం, విటమిన్లు, విటమిన్ బి, బి12, సి వంటివి నశిస్తాయంటున్నారు. టీలో కెఫీన్ ఉంటుంది. టీ ఎక్కువ సేపు మరిగించినప్పుడు కెఫీన్ చేదు రుచి పెరుగుతుంది. అలా అధిక కెఫీన్ తీసుకోవడం వల్ల ఆందోళన, నిద్రలేమి, గుండె దడ వంటి సమస్యలు రావొచ్చంటున్నారు.

ఛాయ్‌లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ఎక్కువ సేపు మరిగించినప్పుడు ఇవి కూడా నాశనమవుతాయంటున్నారు నిపుణులు. మొత్తంగా పాలతో టీ తయారు చేసుకునేవారు ఎట్టిపరిస్థితుల్లోనూ 3 నుంచి 5 నిమిషాలకు మించకుండా మరిగించాలని నిపుణలు చెబుతున్నారు.