1 / 5
పెసర పప్పులో ప్రోటీన్స్, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. దీని కారణంగా సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఇందులో లభించే ఫైబర్ పొట్టను ఆరోగ్యంగా చేస్తుంది. పెసర పప్పులో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.