చలికాలంలో నువ్వుల లడ్డూ తినడం వలన ఎన్ని లాభాలో తెలుసా?

Updated on: Dec 29, 2025 | 4:01 PM

చలికాలం వచ్చిందంటే చాలు అనేక వైరల్ ఇన్‌ఫెక్షన్స్ దాడి చేస్తుంటాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోయి చాలా మంది సీజనల్ వ్యాధుల బారిన పడతారు. అందువలన ఈ సీజన్‌లో శరీరానికి వెచ్చదానాన్ని ఇచ్చి, రోగనిరోధక శక్తిని పెంచే నువ్వుల లడ్డు తినడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయంట. కాగా, శీతాకాలంలో నువ్వుల లడ్డు తినడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.

1 / 5
నువ్వుల లడ్డులో బెల్లం, నువ్వులు ఉంటాయి. ఇది తినడానికి రుచిగా ఉండటమే కాకుండా, ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అందువలన వీటిని చలికాలంలో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. ముఖ్యంగా రోజుకు ఒక నువ్వుల లడ్డు తినడం వలన రక్తహీనత తగ్గిపోతుందంట. చిన్న పిల్లలకు ఇది చాలా మంచిది.

2 / 5
నువ్వుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందువలన చలికాలంలో నువ్వుల లడ్డు తినడం వలన ఇది ఎముకల బలానికి చాలా మంచిది. ముఖ్యంగా పిల్లల ఎముకలు బలంగా తయారు అవ్వడానికి తప్పకుండా నువ్వుల లడ్డు తినాలంట. అదే విధంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు కూడా ప్రతి రోజూ ఒక నువ్వుల లడ్డు తినడం మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

3 / 5
నువ్వుల లడ్డులో బెల్లం ఉంటుంది. బెల్లం అనేది ఐరన్‌కు మూలం. అందువలన రక్తహీనత సమస్యతో బాధపడే వారు, రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నవారు నువ్వుల లడ్డు తినడం చాలా మంచిది. ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

4 / 5
నువ్వులలో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. అందువలన జీర్ణ సమస్యలతో సతమతం అయ్యే వారు కూడా ఇది తినడం చాలా మంచిది. చలికాలంలో చాలా మంది మలబద్ధకం వంటి కడుపు సంబంధిత సమస్యలో ఇబ్బంది పడుతారు. అలాంటి వారు రోజుకు ఒక నువ్వుల లడ్డు తినడం వలన ఆ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు.

5 / 5
అంతే కాకుండా నువ్వుల లడ్డు తినడం వలన చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. చలికాలంలో మీ శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది. అయితే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అయినప్పటికీ, శరీరంలో అతి వేడి సమస్యతో బాధపడే వారు దీనిని తినకపోవడమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.