
ఆరోగ్యానికి మించిన సంపద లేదంటారు. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కానీ మారుతున్న జీవనశైలి, తీసుకుంటున్న ఆహారం కారణంగా చాలా మంది అనేక రోగాల బారిన పడుతున్నారు. ఇక వర్షాకాలం వలస్తే చాలు వ్యాధులు స్వైర విహారం చేస్తుంటాయి. కలుషితమైన నీరు , ఆహారం వలన అనేక రకాల ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అందుకే ఈ సీజన్‌లో తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు. ముఖ్యంగా కొన్ని రకాల కూరగాయలను అస్సలే వండుకోకూడదంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

ఆకుకూరలు : ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ వర్షాకాలంలో మాత్రం అవి అంత సురక్షితమైనవి కావు అని చెబుతుంటారు. ఎందుకంటే ఇవి భూమికి దగ్గరగా పెరుగుతుంటాయి. అయితే వర్షాల సమయంలో వరదల సమయంలో ఆకుకూరలు నీటిలో మునిగిపోతాయి. దీని వలన బ్యాక్టీరియా, సంతానోత్పత్తికి ఆకుకూరల మొక్కలు నివాసంగా ఏర్పడుతాయి. అందుకే వీటిని తినకూడదని చెబుతుంటారు. ఒక వేళ అలాంటి ఆకు కూరలు తినడం వలన కడుపు ఇన్ఫెక్షన్స్, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వస్తాయంట.

కాలీఫ్లవర్ :కాలీఫ్లవర్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అయితే దీనిని వర్షాకాలంలో అస్సలే తినకూడదంట. ఎందుకంటే? ఈ సీజన్‌లో కీటకాలు, పురుగులకు ఇది ఆవాసంగా ఉంటుందంట. దీనివలన జీర్ణసమస్యలు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

క్యాబేజీ : క్యాబేజీ కర్రీతో ఏ వంటకం అయినా సులభంగా చేసుకోవచ్చు. అయితే దీనితో పకోడి లేదా సైడ్ డిష్ క్యాబేజీ ప్రైస్ చేసుకొని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. కానీ ఇలా అస్సలే తినకూడదంట. ఎందుకంటే క్యాబేజిలో తేమ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇది భూమికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో దీనిని తినడం వలన అనేక ఇబ్బందులు తలెత్తుతాయంట.

పుట్టగొడుగులు : అధిక తేమ కలిగిన ఆహారాల్లో పుట్ట గొడుగులు ఒకటి. వీటిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది సాధారణం అందువలన వర్షాకాలంలో వీటిని ఎక్కువగా తినకూడదంట. దీని వలన ఫుడ్ పాయిజనింగ్, అలెర్జీ వంటి సమస్యలు వస్తాయంట. ఒక వేళ వండుకుంటే కొనుగోలు చేసిన వెంటనే వాటిని ఉడకబెట్టాలంట. అంతే కాకుండా ఈ సీజన్‌లో క్యాప్సికమ్ కూడా తినడం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు