- Telugu News Photo Gallery These are the best places near Hyderabad for a trip during the monsoon season
వర్షాకాలంలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..హైదరాబాద్ దగ్గరిలోని బెస్ట్ ప్లేసెస్ ఇవే!
వర్షాకాలంలో చాలా మంది అందమైన ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో వాతావరణం చాలా తేమగా, ఆహ్లాదంగా ఉండటంతో ఈ సమయంలో ఎక్కువ మంది టూర్ ప్లాన్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు మనం వర్షాకాంలో హైదరాబాద్ దగ్గరిలోని బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ ఏవో చూసేద్దాం.
Updated on: Aug 18, 2025 | 12:38 PM

అనంతగిరి హిల్స్ : హైదరాబాద్ దగ్గరలో ఉన్న అందమైన ప్రదేశాల్లో అనంతగిరి హిల్స్ ఒకటి. అరకులోయను తలపించేలా ఉండే ఇది పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంటుంది. హైదరాబాద్‌కు 80 నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సాహసప్రియులకు ఇది అద్భుతమైన ప్రదేశం.

కుంతాల జలపాతం : అందమైన జలపాతాల్లో ఇది ఒకటి. ఇది రాష్ట్రంలోనే అందమైన జలపాతంగా పేరుగాంచింది. వర్షాకాలంలో చూడాల్సిన అందమైన ప్రదేశాల్లో ఇది ఒకటి. 147 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు ప్రవహిస్తూ, చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంటుంది.

భువనగిరి కోట : హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న భవనగిరి కోట వర్షాకాలంలో చూడాల్సిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ ట్రెక్ చేయడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చాలా మంది ఈ ప్రదేశానికి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు.

ఎలగందుల కోట : తెలంగాణలో ఉన్న అందమైన కోటల్లో ఎలగందుల కోట ఒకటి. ఇది కరీంనగర్ జిల్లాలో ఉంది. ఇక్కడ రాజుల భవనాలు, వారి పురాతన జ్ఞాపక చిహ్నాలు వంటివి ఉంటాయి. ఇది విదేశీయుల కోటను పోలి ఉంటుంది. చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఈ కోట. ఇక ఆగస్టు, సెప్టెంబర్‌లో టూర్ ప్లాన్ చేసుకునే వారికి ఇది మంచి ప్లేస్, అలాగే ఇక్కడి దోరిమినార్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

కొండ పోచమ్మ రిజర్వాయర్ : హైదరాబాద్‌కు చాలా దగ్గరగా ఉండే టూరిస్ట్ ప్లేసెస్‌లో కొండపోచమ్మ రిజర్వాయర్ ఒకటి. వర్షాకాలంలో ఇక్కడి దృశ్యాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. స్నేహితులతో కలిసి వెళ్తే చాలా ఎంజాయ్ చేయవచ్చును.



