ఉదయం Vs సాయంత్రం.. కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగితే ఆరోగ్యానికి మంచిది..?

Updated on: Jan 30, 2026 | 6:49 PM

Coconut Water: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన ఆహారపు అలవాట్లు లేక తీవ్రమైన పని ఒత్తిడితో చాలామంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా తక్షణ శక్తిని ఇచ్చే సహజసిద్ధమైన పానీయం కోసం అందరూ వెతుకుతుంటారు. అటువంటి వారికి ప్రకృతి ప్రసాదించిన వరమే కొబ్బరి నీళ్లు. కొబ్బరి నీళ్లలో ఉండే అద్భుతమైన పోషకాలు మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
కొబ్బరి నీళ్లు పోషకాల నిలయం. కొబ్బరి నీళ్లలో సోడియం, పొటాషియం, కాల్షియం,  మెగ్నీషియం వంటి ఖనిజాలతో పాటు శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఎండ వేడికి శరీరం డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు తిరిగి ప్రాణం పోయడానికి కొబ్బరి నీళ్లు ఉత్తమ పరిష్కారం.

2 / 5
జీర్ణక్రియ: మీరు గ్యాస్, ఎసిడిటీ లేదా మలబద్ధకం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే కొబ్బరి నీళ్లు మీకు రామబాణంలా పనిచేస్తాయి. ఇందులో ఉండే ఎంజైమ్‌లు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి.

3 / 5
గుండెకు రక్షణ కవచం: గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. తద్వారా గుండెపోటు వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

4 / 5
మెరిసే చర్మం: సౌందర్య పరంగా కూడా కొబ్బరి నీళ్లు అద్భుతాలు చేస్తాయి. శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపి చర్మాన్ని శుభ్రంగా ఉంచుతాయి. మొటిమలు, మచ్చలు తగ్గడమే కాకుండా జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.

5 / 5
ఎప్పుడు తాగాలి?: ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల మెటబాలిజం మెరుగుపడుతుంది. వ్యాయామం చేసేవారు తక్షణ శక్తి కోసం దీనిని తీసుకోవచ్చు. ఆరోగ్యవంతులు రోజుకు 1 నుండి 2 గ్లాసుల వరకు తీసుకోవచ్చు. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే కొబ్బరి నీళ్లను మీ డైట్‌లో చేర్చుకునే ముందు డాక్టరును సంప్రదించడం మంచిది.