Pushpak AC Bus: ఆ రూట్‌లో వెళ్లే ప్రయాణికులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏసీ బస్సులో ఉచిత ప్రయాణం!

Edited By:

Updated on: Jul 10, 2026 | 6:24 PM

హైదరాబాద్ - బెంగళూరు మధ్య ప్రయాణించే ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు,సాధారణ ప్రయాణీకులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణీకులను ఆకట్టుకునేందుకు ఆర్టీసీ ప్రవేశపెట్టిన ఒక వినూత్న ఆఫర్‌కు పబ్లిక్ నుంచి విశేష స్పందన లభిస్తోంది. బెంగళూరు రూట్‌లో సర్వీసులను పెంచడంతో పాటు, ప్రయాణీకులకు నగరంలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

1 / 5
సాధారణంగా హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లేవారు నగరంలోని వివిధ ప్రాంతాల నుండి బస్ ఎక్కే పాయింట్ల వరకు రావడానికి భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దీన్ని గమనించిన టీజీఎస్ఆర్‌టీసీ యాజమాన్యం ప్రయాణీకులకు ఆర్థిక భారం తగ్గించేలా ఉచిత పుష్పక్ ఏసీ ప్రయాణం ఆఫర్‌ను తీసుకొచ్చింది. బెంగళూరుకు TGSRTC బస్సు టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణీకులు.. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుండి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రూట్‌లో నడిచే లగ్జరీ పుష్పక్ ఈ-సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది.ప్రయాణీకులు తమ బెంగళూరు జర్నీ టికెట్‌ను పుష్పక్ బస్ కండక్టర్‌కు చూపిస్తే సరిపోతుంది.. రూపాయి ఖర్చు లేకుండా ప్రయాణించవచ్చు.

2 / 5
ఆర్టీసీ తీసుకున్న ఈ క్రేజీ నిర్ణయం వల్ల ప్రయాణీకులకు కనెక్టివిటీ సులభమవ్వడమే కాకుండా, జేబుకు చిల్లు పడకుండా సేఫ్ జర్నీ చేసే అవకాశం దక్కింది. ఈ ఆఫర్ హిట్ అవ్వడంతో ఆర్టీసీ బుకింగ్స్ ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం ఈ ఆఫర్ వల్ల ప్రతిరోజూ అదనంగా 60 నుండి 70 టికెట్లు బుక్ అవుతుండటం విశేషం.

3 / 5
భారీగా పెరిగిన సర్వీసులు, స్టాపింగులు..ప్రయాణీకుల రద్దీ, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ - బెంగళూర్ మధ్య బస్ స్టాపింగులను సంస్థ భారీగా పెంచింది. ఐటీ కారిడార్ వారితో పాటు సాధారణ ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులు నడపాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి అధికారులను ఆదేశించారు.

4 / 5
ప్రయాణీకుల సౌకర్యార్థం, వారి సురక్షిత ప్రయాణమే ధ్యేయంగా TGSRTC నిరంతరం కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతోంది. బెంగళూరు ప్రయాణీకుల కోసం ప్రవేశపెట్టిన ఉచిత పుష్పక్ ఏసీ కనెక్టివిటీకి వస్తున్న ఆదరణ చాలా సంతోషాన్నిస్తోంది. ఈ సదుపాయాన్ని ప్రయాణీకులందరూ మరింతగా సద్వినియోగం చేసుకోవాలి అని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కోరారు.

5 / 5
మొత్తానికి ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ, ప్రయాణీకులకు ఫ్రెండ్లీగా మారుతున్న టీజీఆర్‌టీసీ సరికొత్త నిర్ణయాలపై ప్రయాణీకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బెంగళూరు ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే వారు తక్షణమే ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌లో టికెట్లు బుక్ చేసుకుని ఈ ఉచిత పుష్పక్ ఏసీ సౌకర్యాన్ని వాడుకోవచ్చు.

Follow Us