YouTube: యూట్యూబర్స్కు వార్నింగ్.. ఆరు నెలల్లో 30,000 వీడియోలను తొలగించిన సంస్థ.. కారణమిదే..
YouTube: 2020 ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటి వరకు యూట్యూబ్ దాదాపు 8 లక్షల వీడియోలను తొలగించింది. ఆ వీడియోలు తొలగించేందుకు బలమైన కారణలివే..
Follow us on
కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా కంటెంట్ ఉన్న వీడియోలను యూట్యూబ్ నిబంధనల ప్రకారం తొలగించబడిందని నివేదిక పేర్కొంది. ఫేస్బుక్ మరియు ట్విట్టర్‌తో సహా ఇతర ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఇలాంటి ఫేక్ కంటెంట్ ఉన్న వీడియోలను, పోస్టులను తగ్గించడానికి విధివిధానాలను రూపొందించాయి.
ఆక్సియోస్ నివేదిక ప్రకారం, వీడియో-స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం 2020 ఫిబ్రవరి నుండి కోవిడ్ -19పై తప్పుడు సమాచారం అందిస్తున్న 8,00,000 వీడియోలను తొలగించింది. ఈ వీడియోలను మొదట సంస్థ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(AI) వ్యవస్థ, సంస్థ ప్రతినిధులు వీక్షించి పరిశీలిస్తారు. ఆ తరువాత అవి ఎంతమేరకు నిజమైనవి అనేది నిర్ధారించుకుని ఫేక్ న్యూస్ వీడియోలను తొలగిస్తారు.
తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న వీడియోలపై యూట్యూబ్ యాజమాన్యం కొరడా ఝుళిపిస్తోంది. ఇందులో భాగంగానే కోవిడ్-19 వ్యాప్తి, వ్యాక్సినేషన్‌పై గత ఆరు నెలల్లో 30,000 వీడియోలను తొలగించింది.
ఇటీవల మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ఫేక్ ప్రచారాన్ని అడ్డుకోవడానికి సరికొత్త వ్యవస్థను తీసుకువచ్చింది. కోవిడ్-19 టీకా గురించి, లేదా ఇతర అంశాలపై తప్పుడు ప్రచారం చేసినట్లయితే ఆటోమేటిక్‌గా ఆ అకౌంట్ సస్పెండ్ అవుతుంది. ఇక ఐదు సార్లకు మించి సదరు అకౌంట్ సస్పెన్షన్‌కు గురైతే.. అది పర్మనెంట్‌గా డిలీట్ అవుతుంది.
కోవిడ్ -19 వ్యాక్సినేషన్‌పై ప్రచారం చేపట్టినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా ట్విట్టర్ దాదాపు 8,400 పైగా ట్వీట్లను తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా 1.15 కోట్ల ఖాతాలపై చర్యలు తీసుకుందని సదరు నివేదిక తెలిపింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌పై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. భారతదేశంలోనూ కరోనా వ్యాక్సిన్ గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ కారణంగానే వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది.