- Telugu News Photo Gallery Technology photos Vivo launches new smartphone Vivo Y36i features and price details
vivo Y36i: రూ. 14 వేలలో 5జీ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ కూడా అదుర్స్..
భారత్‌లో 5జీ సేవలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. చిన్న చిన్న పట్టణాల్లోనూ 5జీ సేవలు ప్రారంభమవుతున్నాయి. దీంతో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు 5జీ ఫోన్‌లను పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో 5జీ ఫోన్‌లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది..
Updated on: Mar 31, 2024 | 8:29 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. వివో వై36ఐ పేరుతో బడ్జెట్ 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం చైనా మార్కెట్‌లో లాంచ్ అయిన ఈ ఫోన్‌ను త్వరలోనే భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

వివో వై36ఐ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.56 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది.

ఈ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పని చేస్తుంది. 5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.

ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇవ్వనున్నారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు.

వివో వై36ఐ ఫోన్‌లో 15 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు. ధర విషయానికొస్తే ఈ ఫోన్ బేస్ వేరియంట్ ఇండియన్ కరెన్సీలో రూ. 14,000గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.




