Truecaller: ట్రూ కాలర్‌లో అదిరిపోయే ఫీచర్.. ఇకపై ఆ సమస్యకు చెక్‌..

|

May 31, 2024 | 10:13 PM

రోజురోజుకీ సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. మారుతోన్న టెక్నాలజీతో పాటు నేరాలు కూడా మారుతున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ పెరుగుతోన్న సమయంలో సైబర్‌ నేరస్థులు రకరకాల మార్గాలను ఎంచుకుంటూ సామాన్యులు బురిడి కొట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏఐ ఆధారిత ఫోన్‌ కాల్స్‌తో నేరగాళ్లు డబ్బులు కాజేస్తున్నారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకే ట్రూ కాలర్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది..

1 / 5
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ రాకతో టెక్నాలజీ ఎంతలా విస్తరించిందో నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా వాయిస్‌ క్లోన్‌ చేసి మోసాలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. పరిచయం ఉన్న వ్యక్తుల్లా ఫోన్‌ చేసిన డబ్బులు కాజేస్తున్న కేసులు ఇటీవల భారీగా పెరుగుతున్నాయి.

2 / 5
ఏఐ ఆధారిత కాల్స్‌ను నిజమైనా కాల్స్‌గా భావించి కొందరు మోసపోతున్నారు. తన ఫోన్‌ పోయిందని, ఆసుపత్రిలో ఉన్నామని అర్జెంట్‌గా డబ్బులు పంపించాలంటూ కాల్స్‌ చేస్తూ డబ్బులు కాజేస్తున్నారు. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ట్రూ కలర్‌ కొత్త ఫీచర్‌ తీసుకొచ్చింది.

3 / 5
ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో మోస పూరిత కాల్స్‌ను గుర్తించవచ్చు. మీకు ఏదైనా కాల్‌ వస్తే అది.. ‘ఏఐ సాయంతో జనరేట్ చేశారా.. లేదా’ అన్న సంగతి కొన్ని క్షణాల్లోనే ఈ ఫీచర్ తేల్చేస్తుంది. అందుకోసం కొన్ని క్షణాలు ఆ వాయిస్ రికార్డు చేసి విశ్లేషిస్తుంది.

4 / 5
ఇందుకోసం ట్రూ కాలర్‌ సొంతంగా ఏఐ మోడల్‌ను వినియోగిస్తున్నట్లు తెలిపింది. దీంతో మీకు వచ్చిన కాల్‌ ఒరిజినల్ కాకపోతే వెంటనే మిమ్మల్ని అలర్ట్‌ చేస్తుంది. ఈ ఫీచర్‌ను తొలుత అమెరికాలో ప్రీమియం యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చి తర్వాత అందరికీ పరిచయం చేయనున్నారు.

5 / 5
ఇక ఏఐ ఏఐ స్కామ్ కాల్స్ గుర్తించడానికి ట్రూ కాలర్ యాప్‌ను డిఫాల్ట్ కాలర్ యాప్‌గా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు వచ్చిన కాల్‌కు సంబంధించి.. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే స్టార్ట్ డిటెక్షన్ మీద క్లిక్ చేస్తే రికార్డు చేసిన క్షణాల్లో విశ్లేషించి ఫలితాన్ని నోటిఫికేషన్ ద్వారా చెబుతుంది.