Narender Vaitla |
Mar 27, 2021 | 7:18 AM
ప్రస్తుతం అన్ని వస్తువులు స్మార్ట్‌గా మారిపోతున్నాయి. ఫోన్ నుంచి వాచ్ వరకు.. కారు నుంచి వాషింగ్ మిషిన్ వరకు అన్ని స్మార్ట్ అవతారమెత్తుతున్నాయి.
ఈ క్రమంలోనే మన దైనందిన జీవితంలో ఉపయోగపడే కొన్ని స్మార్ట్ గ్యాడ్జెట్లపై ఓ లుక్కేయండి.
MonBaby: ఒక చిన్న చిప్‌లా ఉండే ఈ గ్యాడ్జెట్‌ను చిన్నారులకు అటాచ్ చేసి పెడితే చాలు. వారి శరీర ఉష్ణోగ్రత, శ్వాస ఎలా తీసుకుంటున్నారు? లాంటి వివరాలను ఎప్పటికప్పుడు స్మార్ట్‌ఫోన్‌కు అందిస్తుంది.
Jsbaby Kids Smartwatch: ఈ స్మార్ట్ వాచ్ సహాయంతో మీ చిన్నారులు ఎక్కడ ఉన్నారో మీకు లోకేషన్‌తో సహా చేప్పేస్తుంది. అంతేకాకుండా ఎమర్జన్సీ సమయంలో పిల్లలు మూడు ఫోన్ నెంబర్లకు అలర్ట్ పంపుకునే అవకాశం ఉంది.
Ring Video Doorbell: ఈ గ్యాడ్జెట్ సహాయంతో మీ ఇంటికి ఎవరు వచ్చారో ఎక్కడి నుంచైనా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా స్మార్ట్‌ఫోన్ సహాయంతో ఇంటి ముందు నిల్చున్న వారితో మాట్లాడుకునే అవకాశం కూడా ఉంది.
Withings Smart Infrared Thermometer: మొబైల్ ఫోన్‌కు అనుసంధానించుకునే వీలుండే ఈ స్మార్ట్ థర్మామీటర్ సహాయంతో.. బాడీ టెంపరేచర్ తెలుసుకోవడంతో పాటు. మీ శరీర ఉష్ణోగ్రతలో వస్తోన్న మార్పులను మీకు తెలియజేస్తుంది, వైద్య సలహాలు కూడా ఇస్తుంది.