
ఐక్యూజెడ్ 10 స్మార్ట్ ఫోన్.. 6.67 అంగుళాల క్వాడ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్ తో అందుబాటులోకి వచ్చింది. 128 జీబీ, 256 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ.21,999. అయితే రూ.2 వేల బ్యాంక్ ఆఫర్ తో రూ.19,999కి కొనుగోలు చేయవచ్చు.

మోటరోలా నుంచి మోటో ఎడ్జ్ 60 ప్యూజన్ స్మార్ట్ ఫోన్ విడుదలైంది. దీనిలో 1.5 కే ఆల్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 7400 చిప్ సెట్, 50 ఎంపీ సోనీ ఎల్వైటీ ప్రైమరీ సెన్సార్, 13 ఎంపీ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 32 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఏర్పాటు చేశారు.

పోకో కంపెనీ సీ71 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేయనుంది. దీనిలో 6.88 అంగుళాల హెచ్ డీ ప్లస్ 120 హెచ్ జెడ్ డిస్ ప్లే ఏర్పాటు చేశారు. దీంతో విజువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ప్రిమియం స్ప్లిట్ గ్రిడ్ డిజైన్ తో ఈ ఫోన్ ఎంతో ఆకట్టుకుంటోంది. అలాగే ట్రిపుల్ టీయూసీ సర్టిఫికేషన్ అదనపు ప్రత్యేకత. ఏప్రిల్ 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ ను విడుదల చేయనున్నారు.

పోకో ఎఫ్ 7 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను ఇప్పటికే గ్లోబల్ మార్కెట్ లో విడుదల చేశారు. మన దేశంలోకి ఏప్రిల్ లో రానుంది. 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, ఐపీ 68 రేటింగ్, 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్ తో పనితీరు బ్రహ్మాండంగా ఉంటుంది.

వీవో టీ4 5జీ స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ లో మన దేశంలో విడుదల చేయడానికి ఆ కంపెనీ సన్నాహాలు చేస్తోంది. దీనిలో 6.67 అంగుళాల పూర్తి హెచ్ డీ ప్లస్ అమోలెడ్ క్వాడ్ కర్వ్ డిస్ ప్లే ఏర్పాటు చేశారు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్ సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఆండ్రాయిడ్ 15 ఆథారిత ఫన్ టచ్ ఓఎస్ 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ లో పనిచేస్తుంది.