శామ్ సంగ్ గేలాక్సీ ఎఫ్54 5జీ.. నైట్ ఫోటోగ్రఫీకి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ఎందుకంటే దీనిలో రాత్రి సమయంలో ఫోటోలు అద్భుతంగా తీసేందుకు కావాల్సిన ఫీచర్లు చాలా ఇచ్చారు. నైటోగ్రఫీ పేరుతో ప్రత్యేకమైన ఫీచర్ ఇందులో ఉంది. దీనిలో 108ఎంపీ నో షేక్ కెమెరా(ఓఐఎస్) ఉంటుంది. దీంతో అధిక రిజల్యూషన్ తో కూడిన షేక్ ఫ్రీ ఫొటోలు, వీడియోలు వస్తాయి. సింగిల్ షాట్ లో నాలుగు వీడియోలు, నాలుగు ఫొటోలు తీసేందుకు దీనిలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన లెన్స్ లు ఉన్నాయి. దీని ధర ఆన్ లైన్ లో రూ. 31,999గా ఉంది.
గూగుల్ పిక్సల్ 6ఏ.. ఈ ఫోన్లో ప్రత్యేకమైన అంశం ఏమటంటే అన్ బ్లర్ ఫీచర్. ఫొటోలు బ్లర్ కాకుండా షార్ప్ గా వస్తాయి. అలాగే కెమెరాలోని మేజిక్ ఎరేజర్ టూల్ మీకు బాగా ఉపకరిస్తుంది. దీంతో మీరు ఫొటోలోని అవసరం లేని భాగాలను తొలగించుకోవచ్చు. దీని ధర ఫ్లిప్ కార్ట్ లో రూ. 28,000 నుంచి ప్రారంభమవుతుంది.
రియల్ మీ 11 ప్రో ప్లస్ 5జీ.. ఈ ఫోన్లో ఏకంగా 200ఎంపీ సూప్ జూమ్ కెమెరా ఉంటుంది. దీనిలో నాలుగు రెట్ల లాస్ లెస్ జూమ్, రెండు రెట్ల పోర్ట్ రేట్ మోడ్ ఆటో జూమ్ టెక్నాలజీ ఉంటుంది. ఇది కాక ఈ ఫోన్లో క్రియేటివ్ కెమెరా మోడ్స్ కూడా ఉంటాయి. సూపర్ ఐఓఎస్, స్ట్రీట్ ఫొటోగ్రఫీ మోడ్, నైట్ మోడ్ ఉంటుంది. దీని ధర రూ. 23,999 నుంచి రూ. 27,999వరకూ ఉంది.
వివో వీ27 5జీ.. నైట్ ఫొటోగ్రఫీని మరో లెవెల్ కు తీసుకెళ్లడంలో ఇది బాగా ఉపకరిస్తుంది. దీనిలో సోనీ ఐఎంఎక్స్ 766వీ సెన్సార్ ఉంటుంది. వెడ్డింగ్ స్టైల్ పోర్ట్ రేట్ ఫీచర్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్(ఓఐఎస్) ఉంటుంది. దీని ధర రూ. 32,999 నుంచి ప్రారంభమవుతోంది.
ఒప్పో రెనో 8టీ 5జీ.. దీనిలో 108ఎంపీ పోర్టరైట్ కెమెరా ఉంటుంది. ప్రీమియం మైక్రో లెన్స్ ఉంటాయి. అల్ట్రా హై రిజల్యూషన్ అండ్ నోనా పిక్సల్ ప్లస్ టెక్నాలజీ మీకు అత్యద్భుతమైన పిక్చర్స్ ని అందిస్తుంది. అలాగే 2ఎంపీ డెప్త్ కెమెరాలు, 32ఎంపీ సెల్పీ కెమెరా ఉంటుంది. దీని ధర రూ. 29,399 నుంచి ప్రారంభమవుతుంది.