
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం టెక్నో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. టెక్నో స్పార్క్ 20సీ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. టెక్నో స్పార్క్ 20సీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ మార్చి 5వ తేదీన సేల్ ప్రారంభంకానుంది.

టెక్నో స్పార్క్ 20సీ ధర విషయానికొస్తే 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 8,999కాగా లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా రూ. 1000 డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 7,999కే సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.

ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో గేమింగ్ కోసం ప్రత్యేక టెక్నాలజీని అందించారు. ఈ ఫోన్‌ను కేవలం 50 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది. ఇక ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ36ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.6 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. 720 x 1,612 పిక్సెల్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఈ ఫోన్‌లో MediaTek Helio G36 SoC ప్రాసెసర్‌ను ఇచ్చారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు ఫేస్ అన్‌లాక్‌ను కలిగి ఉంది.