
కెమెరాల తయారీకి పెట్టింది పేరు ప్రముఖ టెక్ దిగ్గజం సోనీ. ఈ కంపెనీ నుంచి వచ్చిన కెమెరాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుగాంచాయి.

ఈ క్రమంలోనే సోనీ తాజాగా ఆల్ఫా1 పేరుతో సరికొత్త కెమెరాను మార్కెట్లోకి విడుదల చేసింది. నిజానికి గత మార్చిలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసినప్పటికీ తాజాగా ఇండియాలో ఈ ప్రొడక్ట్‌ను లాంచ్ చేశారు.

ఫుల్ ఫ్రేమ్ మిర్రలెస్‌గా రూపొందించిన ఈ కెమెరాతో 8K వీడియోను కూడా షూట్ చేసుకునే అవకాశం ఉంది.

ఇక ఈ కెమెరా ధర భారత్‌లో అక్షరాల రూ.5,59,990గా ఉండడం విశేషం. మార్చి 12 (శుక్రవారం) నుంచి అన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు, ప్రముఖ స్టోర్‌లలో ఈ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి.

50.1 మెగా పిక్సెల్ సామర్థ్యం కలిగిన ఈ కెమెరాతో హై రిజల్యూషన్, హైస్పీడ్ పెర్ఫామెన్స్‌తో ఫొటోలు తీసుకోవచ్చు.