- Telugu News Photo Gallery Technology photos Samsung planning to launch affordable fold phone samsung galaxy z fold in 2024
Galaxy Z Fold 6: సామ్‌సంగ్ మరో అద్భుతం.. బడ్జెట్ ధరలో మడతపెట్టే ఫోన్
ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్‌లకు భారీగా ఆదరణ లభిస్తోంది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థలన్నీ ఇప్పటికే ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్‌ను లాంచ్ చేశాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సామ్‌సంగ్. ఇప్పటికే గ్యాలక్సీ జెడ్ ఫోల్డ్ 6ని లాంచ్ చేసిన సామ్‌సంగ్, తాజాగా మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది...
Updated on: Jan 26, 2024 | 9:46 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ గ్యాలక్సీ జెడ్ ఫ్లిప్ 5 పేరుతో గతేడాది ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. గతేడాది ఆగస్టులో సామ్‌సంగ్ ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

ఈ స్మార్ట్ ఫోన్ ధరను సామ్‌సంగ్ రూ. 1,54,999గా నిర్ణయించింది. దీంతో కేవలం ప్రీమియం యూజర్లను మాత్రమే టార్గెట్ చేసుకొని తీసుకొచ్చినట్లైంది. అయితే తాజాగా బడ్జెట్ వేరియంట్‌లో ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఫోల్డ్ 6 ఫోన్‌ను త్వరలోనే లాంచ్ చేయనున్నారు.

ఈ ఏడాది మార్కెట్లోకి ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోల్డబుల్ ఫోన్‌ను అందుబాటు ధరలో తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు. ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్‌లో మరింత దూసుకెళ్లడమే లక్ష్యంగా సామ్‌సంగ్ ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు సమాచారం.

చైనాకు చెందిన షావోమీ, హానర్, హువాయ్ లాంటి కంపెనీలు తక్కువ ధరలోనే ఫోల్డబుల్ ఫోన్‌లను లాంచ్ చేస్తున్న తరుణంలో పోటీని తట్టుకునేందుకు సామ్‌సంగ్ ఈ ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూలై తర్వాత ఈ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇక సామ్‌సంగ్ గ్యాలక్సీ జెడ్ ఫోల్డ్ 5 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 7.6 ఇంచెస్‌తో కూడిన ప్రైమీ డిస్‌ప్లేను అందించారు. ఇక సెకండరీ స్క్రీన్‌ను 6 ఇంచెస్‌తో ఇచ్చారు.ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.




