దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 4వ తేదీన సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్23 ఎఫ్‌ఈ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకురానుంది.
ప్రీమియం యూజర్లను టార్గెట్ చేసుకొని తీసుకొస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.4 ఇంచెస్‌తో కూడిన డైనమిక్ ఫుల్ హెచ్‌డీ + అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 2 ఎక్స్ డిస్‌ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం.
ఇక కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్ రెయిర్ కెమెరాను అందిస్తున్నారు. ఇక బ్యాటరీ పరంగా చూస్తే.. ఇందులో 4500 ఎమ్‌ఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందిస్తున్నారు.
సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్23 ఎఫ్‌ఈ స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్‌లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ లాంచ్ అవుతుండగా, భారత్‌లో మాత్రం ఎక్స్ నోస్ 2200 చిప్‌సెట్‌తో తీసుకురానున్నారు.
ఈ స్మార్ట్ ఫోన్‌ను పర్పుల్‌తో పాలు మరికొన్ని కలర్స్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు. సామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ధర విషయానికొస్తే.. రూ. 59,900గా ఉండనుంది.