ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభమైనప్పటి నుంచి ఆపిల్ యాప్ స్టోర్ నుంచి అనేక కంపెనీలు తమ యాప్‌లు, గేమ్‌లను తీసివేయాలని నిర్ణయించుకున్నాయి. రష్యన్ దాదాపు 6,982 మొబైల్ యాప్‌లను కోల్పోయింది. యాప్ ఇంటెలిజెన్స్ సంస్థలు సెన్సార్ టవర్, టెక్ క్రంచ్‌తో పంచుకున్న డేటా ప్రకారం.. ఆ యాప్‌లు రష్యాలో దాదాపు 218 మిలియన్ సార్లు డౌన్‌లోడ్ అయ్యాయి.
ఉక్రెయిన్ దాడి (ఫిబ్రవరి 24) తర్వాత యాప్ తొలగింపు ఫిబ్రవరి మొదటి రెండు వారాలతో పోలిస్తే 105 శాతం పెరుగుదలను సూచిస్తుంది. మునుపటి కాలంలో రష్యన్ యాప్ స్టోర్ నుంచి కేవలం 3,404 యాప్‌లు మాత్రమే తొలగించారు.
రష్యన్ యాప్ స్టోర్ నుంచి కోకాకోలా తన iOS యాప్‌ను తీసివేసినట్లు ప్రకటించింది. H&M, American Eagle Outfitters వంటి రిటైలర్లు Ebates షాపింగ్ ప్లాట్‌ఫారమ్ షాప్‌స్టైల్ నుంచి యాప్‌లను ఉపసంహరించుకున్నారు. NFL, NBA, WWE, Eurosport కోసం యాప్‌లు రష్యన్ యాప్ స్టోర్ నుంచి అదృశ్యమయ్యాయి.
రష్యన్ యాప్ స్టోర్ Zynga, Supercell, Take-Two (Rockstar Games) వంటి అగ్ర గేమ్‌లను కోల్పోయింది. నెట్‌ఫ్లిక్స్ దేశంలో తన స్ట్రీమింగ్ యాప్‌ను తొలగించింది.
ఇతర యాప్ రిమూవల్‌లలో Amazon IMDb, ట్రావెల్ యాప్ ట్రివాగో, ది వెదర్ ఛానల్ (IBM), గూగుల్ హోమ్ ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ రష్యాలో బ్లాక్ చేశారు.