
రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా పలు ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్స్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్ స్టోర్ క్రోమా కూడా అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. జనవరి 19న ప్రారంభమైన ఈ ఆఫర్లు జనవరి 29 వరకు కొనసాగనున్నాయి.

సేల్‌లో భాగంగా క్రోమా 307L ఇన్వర్టర్ ఫ్రాస్ట్-ఫ్రీ రిఫ్రిజిరేటర్ ధర రూ.22,990కి అందిస్తోంది. ఇక ఫ్రండ్ లోడ్ వాషింగ్ మిషిన్లు రూ. 19,900 నుంచి ప్రారంభమవుతున్నాయి.

యాపిల్ ఎయిర్ పాడ్స్ రూ. 8,999 నుంచి అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు స్పీకర్లపై కూడా క్రోమా బెస్ట్ ఆఫర్స్‌ను అందిస్తోంది. స్పీకర్ల ధరలు రూ. 3,599 నుంచి ఉన్నాయి.

స్మార్ట్ టీవీలపై కూడా బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి. సామ్‌సంగ్, ఎల్‌జీ వంటి బ్రాండ్స్‌లో 4కే ఎల్‌ఈడీ టీవీలపై ఏకంగా 10 నుంచి 20 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాకుండా తక్కువ డౌన్ పేమెంట్‌తో ఈఎంఐ ఆప్షన్‌ను అందిస్తోంది.

ల్యాప్‌టాప్‌లపై కూడా మంచి ఆఫర్లను అందిస్తోంది. బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌లు రూ. 33,990 నుంచి ప్రారంభమవుతున్నాయి. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా 10 శాతం డిస్కౌంట్ అందిస్తోంది.