
ఓటీటీ యూజర్లను టార్గెట్ చేసుకొని టెలికం కంపెనీలు కొంగొత్త ప్లాన్స్‌ను పరిచయం చేస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్ టెల్ పలు ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ప్లాన్స్‌తో యూజర్లను అట్రాక్ట్ చేస్తుంటే తాజాగా జియో సైతం కొత్త ప్లాన్‌ను పరిచయం చేసింది.

రూ. 148తో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే యూజర్లు ఏకంగా 12 ఓటీటీలను వీక్షించే అవకాశం పొందొచ్చు. అయితే ఈ ప్లాన్ కేవలం డేటా ప్యాక్ మాత్రమే.

ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే ఎలాంటి వాయిస్ కాల్స్ కానీ, ఎస్సెమ్మెస్‌లు కానీ లభించవు. 28 రోజులు వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది.

ఇదిలా ఉంటే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలంటే కచ్చితంగా ఏదో ఒక బేస్ ప్లాన్ యాక్టివ్‌లో ఉండాల్సిందే. జియో టీవీ ప్రీమియంలో భాగంగా మొత్తం 12 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. అలాగే జియో సినిమా ప్రీమియం కూపన్ మైజియో అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. దీన్ని ఉపయోగించి ఆ ఓటీటీని యాక్టివేట్ చేసుకోవచ్చు.

ఇక ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. సోనీ లివ్, జీ5, జియో సినిమా ప్రీమియం, డిస్కవరీ+, లయన్స్ గేట్, సన్ నెక్ట్స్, కంచలక్క, ప్లానెట్ మరాఠీ, చౌపల్, డాకుబే, ఎపిక్ ఆన్, హియాచాయ్ వంటి మొత్తం 12 ఓటీటీలను ఉచితంగా వీక్షించవచ్చు.