- Telugu News Photo Gallery Technology photos Realme released two new smart watches realme 2 and realme 2 pro in indian market have a look on features and price details
Realme Watch 2: భారత మార్కెట్లోకి రియల్ మీ స్మార్ట్ వాచ్‌లు.. ఆఫర్‌లో ప్రారంభ ధర రూ. 2,999.. ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Realme Watch 2: స్మార్ట్ ఫోన్ తయారీలో తనదైన ముద్ర వేసిన రియల్‌మీ తాజాగా స్మార్ట్ వాచ్‌ల రంగంలోకి కూడా దిగింది. ఈ క్రమంలోనే తాజాగా భారత మార్కెట్లోకి రియల్ మీ వాచ్ 2, రియల్‌మీ వాచ్ 2 ప్రో పేరుతో రెండు కొత్త వాచ్‌లను లాంచ్ చేసింది..
Updated on: Jul 26, 2021 | 12:20 PM

ప్రస్తుతం దాదాపు అన్ని ఎలక్ట్రానిక్ కంపెనీలు స్మార్ట్ వాచ్‌ల తయారీలోకి అడుగుపెట్టాయి. దీంతో పెరుగుతోన్న పోటీ కారణంగా తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో కూడిన వాచ్‌లు మార్కెట్లోకి వస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ తాజాగా భారత మార్కెట్లోకి రియల్ మీ వాచ్ 2, రియల్‌మీ వాచ్ 2 ప్రో పేరుతో రెండు వాచ్‌లను లాంచ్ చేసింది.

ఈ రెండు స్మార్ట్ వాచ్‌లలో 90 స్పోర్ట్స్ మోడ్స్ అందించడం ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. ఇక హార్ట్ రేట్ ట్రాకింగ్, ఎస్‌పీఓ2 ట్రాకింగ్, బ్లూటూత్ వీ5 వంటి ఫీచర్లను అందించారు.

రియల్ మీ వాచ్ 2 12 రోజుల బ్యాటరీని, రియల్ మీ వాచ్ 2 ప్రో 14 రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో అందించారు. రియల్‌మీ లింక్ యాప్ ద్వారా ఈ వాచ్‌లను కంట్రోల్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.

రియల్ మీ వాచ్ 2 ప్రో లో 1.75 ఇంచెస్ టచ్ స్క్రీన్ అందించారు. ఇక రియల్‌మీ వాచ్ 2 లో 1.4 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. ఇందులో 90 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. బాస్కెట్ బాల్, బాక్సింగ్, డాన్సింగ్, గోల్ఫ్, హైకింగ్, ఇండోర్ సైక్లింగ్, అవుట్ డోర్ రన్నింగ్, టేబుల్ టెన్నిస్, యోగా వంటి వాటిని సపోర్ట్ చేస్తాయి.

ధర విషయానికొస్తే.. రియల్‌మీ వాచ్ 2 ధర రూ.3,499 కాగా, రియల్‌మీ వాచ్ 2 ప్రో ధర రూ.4,999గా నిర్ణయించారు. అయితే రియల్‌మీ వాచ్ 2ని ప్రారంభ సేల్‌లో రూ.2,999కే కొనుగోలు చేయవచ్చు. నేటి నుంచే (జులై 26) సేల్ ప్రారంభంకానుంది.





























