Realme GT 6: భారత్‌లోకి రియల్మీ కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. బ్యాటరీకి పెద్ద పీట వేస్తూ..
బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని రోజుకో కొత్త ఫోన్ మార్కెట్లో సందడి చేస్తోంది. మరీ ముఖ్యంగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీలు కొంగొత్త ఫీచర్లతో కూడిన ఫోన్లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. రియల్మీ జీటీ6 పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్ చేస్తున్నారు. ఇంతకి ఈ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
![చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. రియల్మీ జీటీ 6 పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు. జూన్ 20వ తేదీన భారత్‌తో పాటు గ్లోబల్ మార్కెట్లోకి ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. ఇంతకీ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/realme-1.jpg?w=1280&enlarge=true)
1 / 5
![రియల్మీ జీటీ6 స్మార్ట్ ఫోన్లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్3 చిప్సెట్ ప్రాసెసర్‌ను అందించారు. ఇక ఈ ఫోన్లో హీటింగ్ సమస్యకు చెక్ పెట్టేందుకు డ్యూయల్ వీసీ కూలింగ్ సిస్టమ్‌ను అందించారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/realme-gt.jpg)
2 / 5
![120 వాట్స్ సూపర్ వూక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5500 ఎంఏహెచ్ కెపాసిటీ గల పవర్ఫుల్ బ్యాటరీని అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ కేవలం 10 నిమిషాల్లోనే 50 శాతం, 28 నిమిషాల్లో 100 శాతం ఛార్జిగ్ అవుతుందని కంపెనీ చెబతోంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/realme-gt-6.jpg)
3 / 5
![అలాగే ఈ ఫోన్‌ను సింగిల్ ఛార్జింగ్ చేసే 46 గంటల పాటు టాక్‌టైమ్‌తో పాటు ఎనిమిది గంటల గేమింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ ఫోన్లో 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్డీ+ ఎల్టీపీఓ అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/realme-gt-6-price.jpg)
4 / 5
![కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 50 మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 882 ప్రైమరీ సెన్సర్ కెమెరాను, 8-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 355 ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌ను అందించనున్నారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ధర విషయానికొస్తే ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ ధర రూ. 24,200గా ఉండనుంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/realme-smart-phone-1.jpg)
5 / 5