
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మీ తాజాగా మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్‌మీ నార్జో 60 సిరీస్ పేరుతో రెండు ఫోన్‌లను తీసుకొచ్చారు. ఈ సిరీస్‌లో భాగంగా నార్జో 60, నార్జో 60 ప్రో ఫోన్‌లను లాంచ్ చేశారు.

ఈ స్మార్ట్ ఫోన్స్ ఫీచర్ల విషయానికొస్తే.. రియల్ మీ నార్జో 60లో 6.43 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. ప్రో వేరియంట్‌లో మాత్రం 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు.

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. నార్జో 60లో 33 వాట్, ప్రో వెర్షన్‌లో 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఇక కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో నార్జో 60 విషయానికొస్తే 64 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాను ఇచ్చారు. నార్జో 60ప్రోలో 100 ఎంపీ రెయిర్ కెమెరాను అందించారు. రెండు స్మార్ట్ ఫోన్స్‌లో నూ 10 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

ఇక ధర విషయానికొస్తే రియల్ మీ నార్జో 60 ధరలు స్టోరేజ్ ఆధారంగా రూ. 17,999, రూ. 19,999గా ఉన్నాయి. ఇక నార్జో 60 ప్రో రూ. 23,999, రూ. 26,999, రూ. 29,999గా ఉన్నాయి.