Ptron Force X10E: పీట్రాన్‌ నుంచి బడ్జెట్‌ స్మార్ట్‌ వాచ్‌… ఫీచర్లపై ఓ లుక్కేయండి..

|

Jun 03, 2022 | 7:00 PM

Ptron Force X10E: ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్‌ వాచ్‌ల హవా నడుస్తోంది. ప్రముఖ కంపెనీలన్నీ స్మార్ట్‌ వాచ్‌ల తయారీ రంగంలోకి అడుగు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ గ్యాడ్జెట్‌ కంపెనీ పీట్రాన్ కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది. పీట్రాన్‌ ఫోర్స్‌ ఎక్స్‌ 10ఈ పేరుతో...

Ptron Force X10E: పీట్రాన్‌ నుంచి బడ్జెట్‌ స్మార్ట్‌ వాచ్‌... ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Follow us on

Ptron Force X10E: ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్‌ వాచ్‌ల హవా నడుస్తోంది. ప్రముఖ కంపెనీలన్నీ స్మార్ట్‌ వాచ్‌ల తయారీ రంగంలోకి అడుగు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ గ్యాడ్జెట్‌ కంపెనీ పీట్రాన్ కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది. పీట్రాన్‌ ఫోర్స్‌ ఎక్స్‌ 10ఈ పేరుతో తీసుకొచ్చిన ఈ వాచ్‌ సేల్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. బడ్జెట్‌ ధరలో మంచి ఫీచర్లతో వస్తోన్న ఈ స్మార్ట్‌ వాచ్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

పీట్రాన్‌ ఫోర్స్‌ ఎక్స్‌10ఈ స్మార్ట్‌ వాచ్‌లో 240×280 రెజల్యూషన్‌తో కూడిన 1.7 హెచ్‌డీ డిస్‌ప్లే, మెటల్ బాడీని అందించారు. హార్ట్‌రేట్‌ మానిటర్‌, బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ SpO2 ట్రాకర్, బ్లడ్ ప్రజెర్ మానిటర్, స్లీప్ ట్రాకర్ హెల్త్ వంటి ఫీచర్లు ఈ వాచ్‌ ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. ఇందులో 7 యాక్టివ్‌ స్పోర్ట్స్‌ మోడ్స్‌ను అందించారు. స్టెప్ కౌంట్, క్యాలరీస్ బర్న్ వంటి వాటిని రికార్డ్ చేసుకుంటుంది.

బ్లూటూత్‌ వెర్షన్‌ 5ని అందించారు. ఇక ఈ వాచ్‌ను ఒక్కసారి ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే 12 రోజులపాటు నిరంతరాయంగా నడుస్తుంది. వాటర్‌, డస్ట్‌ రెసిస్టెంట్‌ కోసం ఐపీ68 రేటింగ్‌ను ఇచ్చారు. ధర విషయానికొస్తే ఈ వాచ్‌ రూ. 1899కి అందుబాటులో ఉండనుంది. బ్లాక్, స్పేస్ బ్లూ, పింక్ కలర్స్‌లో ఈ వాచ్‌ అందుబాటులోకి రానుంది. త్వరలోనే ఈ వాచ్‌ సేల్‌ అందుబాటులోకి రానుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..