
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. గతంలో తీసుకొచ్చిన పోకో ఎమ్6 ప్రో 5జీ ఫోన్‌కు కొనసాగింపుగా పోకో ఎమ్6 ప్లస్ పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది.

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఈ ఫోన్ ధర విషయానికొస్తే 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,999కాగా, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999గా ఉండనుంది.

కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు.

ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి పలు బ్యాంకులకు చెందిన కార్డులపైస రూ. 1000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌ను అందించనున్నారు. పోకో ఎమ్6 ప్లస్ 5జీ ఫోన్‌ను బ్లాక్, పర్పుల్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో తీసుకొస్తున్నారు.

ఇక ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేస్తుంది. ఇందులో 6.79 ఇంచెస్‌తో కూడిన ఎల్‌సీడీ ప్యానెల్ డిస్‌ప్లేను అందించనున్నారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5030 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని ఇవ్వనున్నారు. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇవ్వనున్నారు.