Poco F6 Pro: పోకో నుంచి మరో స్టన్నింగ్ పోన్‌.. అదిరిపోయే ఫీచర్లతో..

|

May 25, 2024 | 11:47 AM

బడ్జెట్‌ సెగ్మెంట్‌లో వరుసగా స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తున్న ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం పోకో తాజాగా ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. పోకో ఎఫ్‌6 ప్రో పేరుతో గ్లోబల్‌ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ప్రీమియం లుక్స్‌, అధునాతన ఫీచర్లతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో నుంచి కొత్త ఫోన్‌ వచ్చింది. పోకో ఎఫ్‌6 ప్రో పేరుతో ఈ సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. ప్రీమియం బడ్జెట్‌ సెగ్‌మెంట్‌లో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. భారత మార్కెట్లోకి ఈ ఫోన్‌ ఎప్పుడు లాంచ్‌ చేయనున్నారన్నదానిపై కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

2 / 5
ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 4000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తోపాటు డబ్ల్యూడీహెచ్డీ+ డిస్ ప్లేను ఇస్తున్నారు. దీంతో సన్‌లైట్‌లో కూడా స్క్రీన్‌ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్వోసీ చిప్ సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

3 / 5
ధర విషయానికొస్తే 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర మన కరెన్సీలో రూ. 40 వేలు, 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 46 వేలు, 16 జీబీ ర్యామ్‌, 1 టిగా బైట్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 52 వేలుగా నిర్ణయించారు.

4 / 5
ఈ స్మార్ట్ ఫోన్‌ను బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్స్‌లో తీసుకొస్తున్నారు. ఇక ఇందులో 120 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. కేవలం 19 నిమిషాల్లో ఈ ఫోన్‌ బ్యాటరీ 100 శాతం ఛార్జ్‌ అవుతుందని కంపెనీ చెబుతోంది.

5 / 5
కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ట్రిపుల్ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో.. వై-ఫై 7, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి ఫీచర్లను అందించారు. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను అందించారు.