
వరుసగా కొత్త స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తున్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ తాజాగా భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. వన్‌ప్లస్ నార్డ్ 3 పేరుతో రానున్న ఈ ఫోన్‌ను ఏప్రిల్, జూన్ మధ్యలో విడుదల చేయనున్నారు.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. ఈ ఫోన్ ఏ78 కోర్‌తో కూడిన మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌తో పని చేయనుంది.

కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎమ్‌ఎక్స్766 రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీ కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన పంచ్ హోల్ కెమెరాను ఇవ్వనున్నారు.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో రియల్ మీ జీటీ నియో 3తో సమానమైన ఫీచర్లను అందిస్తుందని ఆండ్రాయిడ్ సెంట్రల్ రిపోర్ట్ వెల్లడించింది. ధర ఎంత అన్ని విషయం ఇంకా తెలియలేదు.

ఇక బ్యాటరీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో 150వాట్స్ సూపర్ వీఓఓసీ ఛార్జింగ్ టెక్నాలజీ సదుపాయం కల్పించారు. దీని ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇక బ్యాటరీని 1 శాతం నుండి 50 శాతానికి ఛార్జ్ చేయడానికి 5 నిమిషాలు మాత్రమే పడుతుంది.