
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం నథింగ్ ఫోన్ 2ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. జులై నెలలో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ సీఈవో కార్ల్ పీ అధికారికంగా ప్రకటించారు.

ఈ స్మార్ట్ ఫోన్‌లో నెక్ట్స్ జనరేషన్ నథింగ్ ఫోన్ 2 క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్ఓసీ ప్రాసెసర్‌ను ఇవ్వనున్నారు. ఈ ఫోన్‌లో 4700ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. ఐఫోన్ 14 ప్రో బ్యాటరీ సామమర్థ్యం కంటే అధికం కావడం విశేషం.

ఇక నథింగ్ ఫోన్ 2లో 6.67 ఇంచెస్ స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

ధర విషయానికొస్తే నథింగ్ ఫోన్ 2 భారత్‌లో రూ. 39,900గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. జులై 19వ తేదీన భారత్‌లో లాంచ్ కానున్నట్లు సమాచారం. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు.