ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ నాయిస్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. నాయిస్ వాయేజ్ పేరుతో ఈ కొత్త వాచ్‌ను లాంచ్ చేశారు. ఈ వాచ్ ఇ-సిమ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందుకోసం జియో, ఎయిర్‌టెల్ వంటి సర్వీస్ ప్రొవైడర్‌లతో ఒప్పందం చేసుకుంది
నాయిస్ వాయేజ్ స్మార్ట్ వాచ్ ముందస్తు బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. డిసెంబర్ 23వ తేదీ నుంచి నాయిస్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్‌లోనూ అందుబాటులోకి రానుంది.
ఇక ఈ స్మార్ట్ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 1.4 ఇంచెస్‌తో కూడిన రెటినా అమో ఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. క్రిస్టల్-క్లియర్ విజువల్స్ నేచురల్ యూజర్ ఇంటర్‌ఫేస్ ఈ వాచ్ ప్రత్యేకతగా చెప్పొచ్చు.
ఇక ఇందులో పొజిషన్ ట్రాకింగ్ కోసం జీపీఎస్ గ్లోనాస్ ఫీచర్‌ను ఇస్తున్నారు. దీంతో వాచ్‌లో చూస్తూనే దారి తెలుసుకోవచ్చు. హెల్త్, యాక్టివిటీ ట్రాకింగ్ కోసం ఇందులో పలు ఫీచర్లను అందించారు.
హార్ట్ బీట్ రేట్, ఎస్‌పీఓ2 వంటి ఫీచర్లను అందించారు. ఇక నాయిస్ వాయేజ్‌ను కొనుగోలు చేసే వారికి ఆఫర్‌ను అందిస్తోంది. దీంతో 3 నెలల ఉచిత కాలింగ్‌ను పొందొచ్చు. నోటిఫికేషన్ డిస్‌ప్లే, వెదర్ అప్‌డేట్స్, రిమైండర్స్, అలారమ్, కెమెరా కంట్రోల్, మ్యూజిక్ కంట్రోల్, క్యాలిక్యులేటర్ వంటి ఫీచర్స్‌ను ఇచ్చారు.