
ఇటీవల వరుసగా స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోన్న స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరోలా తాజాగా భారత మార్కెట్లోకి మరో కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. మోటో జీ82 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ఫీచర్లు మీకోసం.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120 హెచ్‌జెడ్ 10-బిట్‌తో కూడి పీఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. స్క్రీన్ సైజ్ 6.6 ఇంచెస్‌గా ఇచ్చారు.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. ఈ బ్యాటరీ 30 వాట్స్ టర్బో పవర్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

కెమెరా విషయానికోస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

6 జీబీ ర్యామ్+128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 26,500కి అందుబాటులోకి రానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి రానుంది.