Infinix InBook Y3 Max: ఇన్‌ఫినిక్స్‌ నుంచి కొత్త ల్యాప్‌టాప్‌.. తక్కువ ధరలోనే..

|

Aug 16, 2024 | 8:24 PM

1 / 5
చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ఇన్‌ఫినిక్స్‌ మార్కెట్లోకి కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్‌ చేసింది. బడ్జెట్‌ ధరలో మంచి ఫీచర్లతో కూడిన ఈ ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చారు. ఈ ల్యాప్‌టాప్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
ఫీచర్ల విషయానికొస్తే ఇన్‌ఫినిక్స్‌ ఇన్‌బుక్‌ వై3 మ్యాక్స్‌ ల్యాప్‌టాప్‌లో 146 ఇంచెస్తో కూడిన ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్‌ డిస్‌ప్లేను ఇచ్చారు. 300 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 87 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో ఈ స్క్రీన్‌ సొంతం.

3 / 5
బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 70WH బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్‌ చేస్తే ఏకంగా 14.6 గంటల స్టాండ్‌బై ఇస్తుందని కంపెనీ చెబుతోంది. 12th Gen ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌లతో Intel Core i3, Core i5, Core i7 ఛాయిస్‌తో ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ గ్రాఫిక్స్‌‌తో తీసుకొచ్చారు.

4 / 5
ఇక ఈ ల్యాప్‌టాప్‌లో 16 జీబీ ర్యామ్‌, 1 టీబీ వరకు స్టోరేజ్‌ను అందించారు. విండోస్ 11 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో ఈ ల్యాప్‌టాప్‌ రన్ అవుతుంది. ఇక ఇందులో ఫుల్‌హెచ్‌డీ(1080p)తో కూడిన వెబ్‌క్యామ్‌ను కలిగి అందించారు.

5 / 5
అలాగే ఇందులో ఐస్ స్టార్మ్ కూలింగ్ టెక్నాలజీని అందించారు. దీంతో ల్యాప్‌టాప్‌ వేడెక్కదు. టైప్‌ సీ చార్జింగ్‌ పోర్ట్‌కు సపోర్ట్ చేస్తుంది. బరువు 1.78 కిలోగ్రాములుగా ఉంది. ధర విషయానికొస్తే.. మ్యాక్స్ ఇంటెల్ కోర్ i3 ప్రారంభ ధర రూ.29,999గా ఉంది. ఆగస్టు 21వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.