
ప్రస్తుతం మార్కెట్లో వరుసగా కొత్త స్మార్ట్ టీవీలు క్యూ కడుతున్న తరుణంలో ఇన్ఫినిక్స్ కొత్త టీవీని తీసుకొచ్చింది. 55 ఇంచెస్ QLED డిస్‌ప్లేతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌టీవీలో అదిరిపోయే ఫీచర్లను అందించారు.

ఈ స్మార్ట్ టీవీలో డాల్బీ విజన్, 60Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ కోసం క్వాంటమ్ డాట్ డిస్‌ప్లేను ప్రత్యేకంగా ఇచ్చారు. ఈ టీవీ క్వాడ్‌కోర్ మీడియాటెక్ సీఏ55 ప్రాసెసర్‌తో పని చేస్తుంది.

2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చిన ఈ టీవీ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి యాప్స్‌కు సపోర్ట్ చేస్తుంది.

గరిష్టంగా 36 వాట్స్ సౌండ్ అవుట్‌పుట్‌తో తీసుకొచ్చిన ఈ టీవీలో డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ చేసే రెండు స్పీకర్లను అందించారు. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ ఫీచర్లు ఉన్నాయి.

ధర విషయానికొస్తే ఈ 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ ధర రూ. 34,990గా ఉంది. ఈ నెల 22వ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కు రానుంది.