Amazon sale: మండే ఎండలతో టెన్షన్ వద్దు.. అమెజాన్ లో అత్యంత తక్కువ ధరకే ఏసీలు
వేసవి కాలం వచ్చేందంటే ప్రజలకు గుబులు మొదలవుతుంది. విపరీతంగా కాసే ఎండల నుంచి ఎలా రక్షించుకోవాలా అని భయపడతారు. బయట ఎండ, ఇంట్లో ఉక్కబోతతో సతమతమవుతారు. ఈ సమయంలో ఎయిర్ కండీషనర్ ఉంటే బాగుంటుందని భావిస్తారు. ఇలాంటి వారందరికీ అమెజాన్ శుభవార్త చెప్పింది. భారీ డిస్కౌంట్లు, అపరిమిత క్యాష్ బ్యాక్ లతో గ్రేట్ సమ్మర్ సేల్ ను ప్రారంభించింది. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ వస్తువులు, ఉపకరణాలతో పాటు ఏసీలను అత్యంత తక్కువ ధరకే అందజేస్తోంది. ఈ నేపథ్యంలో అమెజాన్ లో భారీ డిస్కౌంట్ పై అందుబాటులో ఉన్న ప్రముఖ బ్రాండ్ల ఏసీలు, వాటి ప్రత్యేతకలు, ధర వివరాలను తెలుసుకుందాం.
Updated on: May 04, 2025 | 6:00 PM

మండు వేసవిలో చక్కని చల్లదనాన్ని అందించే ఏసీలలో డైకిన్ 0.8 టన్ 3 స్టార్ ఫిక్స్ డ్ స్పీడ్ స్ప్లిట్ ఏసీ ఒకటి. దీనిలోని పీఎం 2.5 ఫిల్టర్.. గాలిలోని బ్యాక్టీరియాను వడకట్టి, స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. అత్యంత వేడి పరిస్థితిలోనూ చల్లని గాలిని అందించేందుకు పవర్ చిల్ ఆపరేషన్, ధీర్ఘకాలం మన్నేలా రాగి కండెన్సర్ కాయిల్, లోపలి స్టెబిలైజర్, పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఆర్ 32 గ్రీ రిఫ్రిజెరాంట్, చక్కని గాలిని అందించే ఎయిర్ ఫ్లో డ్యూయల్ ప్లాప్ లు అదనపు ప్రత్యేకతలు. అమెజాన్ లో ఈ ఏసీని సుమారు 29 శాతం తగ్గింపుపై రూ.26,490కి కొనుగోలు చేయవచ్చు.

ప్రముఖ బ్రాండ్ ఎల్ జీ నుంచి విడుదలైన 1.5 టన్ 5 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ స్ల్పిట్ ఏసీ తో వేసవి ఇబ్బందుల నుంచి దూరంగా ఉండవచ్చు. మీడియం నుంచి పెద్ద సైజు గదులకు చాాలా బాగా నప్పుతుంది. ధీర్ఘకాలం మన్నేలా డ్యూయల్ ఇన్వెర్టర్ కంప్రెసర్, వేగంగా కూలింగ్ ను అందించే విరాట్ మోడ్, వంద శాతం హై - గ్రూవ్డ్ కాపర్ పైపులు, స్మార్ట్ డిజైన్, 4- వే స్వింగ్స్, డైట్ మోడ్ ప్లస్ తదితర అధునాతన ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. అమెజాన్ లో ఈ ఏసీ రూ.45,490 ధరకు అందుబాటులో ఉంది.

తక్కువ ధరకు లభించే బెస్ట్ ఏసీలలో క్యారియర్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ ముందుంటుంది. ప్రస్తుతం అమెజాన్ లో కేవలం రూ.35,990 ధరకు అందుబాటులో ఉంది. మీడియం సైజు నుంచి పెద్ద పరిమాణం కలిగిన గదులకు ఉపయోగపడుతుంది. 6 ఇన్ 1 మోడ్ లు కలిగిన ఫెక్సీ కూల్ టెక్నాలజీతో కూలింగ్ సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది. యాంటీ కోరేషన్ బ్లూ పూతతో కూడిన వంద శాతం కాపర్ కండెన్సర్ కాయిల్ తో తుప్పు సమస్య ఉండదు. 4 ఫ్యాన్ వేగం, స్టెబిలేజర్ రహిత ఆపరేషన్, హెచ్ డీ, పీఎం 2.5 ఫిల్టర్ అదనపు ప్రత్యేకతలు. అమెజాన్ లో రూ.35,990కు క్యారియర్ ఏసీ అందుబాటులో ఉంది.

అమెజాన్ లో హిటాచీ ఏసీపై దాదాపు 42 శాతం డిస్కౌంట్ అందజేస్తున్నారు. ఇది 1.5 టన్ క్లాస్ 3 స్టార్ రేటింగ్ తో అందుబాటులో ఉంది. వంద శాతం గ్రూవ్డ్ కాపర్, టర్బులెంట్ రిఫ్రిజెరాంట్ తో చక్కని చల్లదనం అందిస్తుంది. ఆటో కాయిల్ డ్రై టెక్నాలజీ మైక్రో బెండ్లు గాలిలో దుమ్ము కణాలను తొలగించి, స్వచ్ఛమైన గాలిని అందజేస్తాయి. ఐస్ క్లీన్, ఆటో కన్వర్టిబుల్, 4- వే స్వింగ్, లాంగ్ ఎయిర్ త్రో తదితర ఫీచర్లు బాగున్నాయి. ఫ్యాన్ వేగం, టైమర్లు, మోడ్ లను అవసరానికి అనుగుణంగా మార్చుకోవచ్చు. అమెజాన్ లో రూ.39,990కి ఈ ఏసీ అందుబాటులో ఉంది.

రిమోట్ కంట్రోల్ నియంత్రణ, ఐదు కూలింగ్ మోడ్ లతో అందుబాటులో ఉన్న లాయిడ్ ఏసీతో మండు వేసవిలో చక్కని చల్లదనాన్ని ఆస్వాదించవచ్చు. సుమారు 160 చదరపు అడుగుల వైశాల్యం గల మీడియం సైజు గదులకు ఈ 1.5 టన్ 3 స్టార్ ఏసీ చాలా బాగుంటుంది. వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్ తో గది ఉష్ణోగ్రతకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుని చల్లదనం అందిస్తుంది. 30 నుంచి 110 శాతం వరకూ వేర్వేరు కూలింగ్ మోడ్ లను అడ్జెస్ట్ చేసుకోవచ్చు. బ్లూ ఫిన్స్ ఎవాపరేటర్ కాయిల్స్ తో మన్నికకు డోకా లేదు. తక్కువ విద్యుత్ ను ఉపయోగించుకోవడం అదనపు ప్రత్యేకత. లాయిడ్ ఏసీని అమెజాన్ లో రూ.32,990కి కొనుగోలు చేసుకోవచ్చు.




