HP: హెచ్‌పీ నుంచి రూ. 2 లక్షల ల్యాప్‌టాప్‌.. ఫీచర్స్‌ అలాంటివి మరీ..

ప్రస్తుతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కు ఆదరణ పెరుగుతోంది. అన్ని రంగాల్లో ఏఐ టెక్నాలజీ వినియోగం భారీగా పెరుగుతోంది. ఇక స్మార్ట్‌ ఫోన్స్‌తో పాటు, ల్యాప్‌టాప్‌లలో కూడా ఏఐ ఆధారిత ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం హెచ్‌పీ భారత మార్కెట్లోకి కొత్త ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. హెచ్‌ఐపీ ఓమ్మిబుక్‌ అల్ట్రా ఫ్లిప్‌ పేరుతో ఈ ల్యాప్‌టాప్‌ను లాంచ్‌ చేసింది..

Narender Vaitla

|

Updated on: Oct 25, 2024 | 6:15 PM

ప్రముఖ ల్యాప్‌టాప్‌ తయారీ సంస్థ హెచ్‌పీ భారత మార్కెట్లోకి కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్‌ చేసింది. ఓమ్ని బుక్‌ అల్ట్రా ఫ్లిప్‌ పేరుతో ఈ ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చారు. హెచ్‌పీ నుంచి వచ్చిన తొలి ఏఐ ఆధారిత 2 ఇన్‌ 1 ల్యాప్‌టాప్‌ ఇదే కావడం విశేషం.

1 / 5
ఈ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్‌కు చెందిన లూనార్‌ లేక్‌ ప్రాసెసర్, ప్రత్యేక న్యూరల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ (ఎన్‌పీయూ)ను అందించారు. సెకనుకు 48 ట్రిలియన్ల ఆపరేషన్స్‌ చేయగలగడం ఈ ప్రాసెసింగ్‌ యూనిట్ ప్రత్యేకతగా చెప్పొచ్చు.

2 / 5
ఫ్రీలాన్సర్లు, కంటెంట్ క్రియేటర్ల కోసం ప్రత్యేకంగా ల్యాప్‌టాప్‌ను రూపొందించారు. ఫీచర్ల విషయానికొస్తే ఈ ల్యాప్‌టాప్లో 2.8 కే రిజల్యూషన్‌తో కూడిన ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.

3 / 5
బ్యాటరీ విషయానికొస్తే ఒక్కసారిగా ఛార్జ్‌ చేస్తే 21 గంటల వరకు పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 9 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఏఐ కెమెరాను, పాలీ ఆడియోను అందించారు. అలాగే ఇందులో సైబర్ అటాక్స్‌ నుంచి తప్పించుకోవడానకి హెచ్‌పీ వోల్ఫ్‌ సెక్యూరిటీ అనే ఏఐ భద్రతా వ్యవస్థను తీసుకొచ్చారు.

4 / 5
ఈ ల్యాప్‌టాప్‌ను.. ట్యాబ్లెట్, టెంట్‌ మోడ్‌ల్లోకి మార్చుకోవచ్చు. రెండు వేరియంట్స్‌లో లభిస్తున్న ఈ ల్యాప్‌టాప్ ఎక్లిప్స్‌ గ్రే, అట్మాస్ఫెరిక్‌ బ్లూ అల్ట్రా7 వేరియంట్‌ ప్రారంభ ధర రూ. 1,81,999గా ఉండగా.. అల్ట్రా 9 వేరియంట్ ధర రూ. 1,91,000గా ఉండనుంది. హెచ్‌పీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, అన్ని రకాల ఈ కామర్స్‌ సంస్థల్లో ల్యాప్‌టాప్‌ అందుబాటులోకి రానుంది.

5 / 5
Follow us