Smartphone: కొత్త ఫోన్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 10 వేల బడ్జెట్‌లో బెస్ట్ డీల్స్ ఇవే..
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పలు స్మార్ట్ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్ లభిస్తోంది. ఇందులో భాగంగా రూ. 10వేలలోనే బెస్ట్ డీల్స్ లభిస్తున్నాయి. అమెజాన్ సేల్‌లో లభిస్తున్న కొన్ని స్మార్ట్ ఫోన్స్, వాటి ఫీచర్లకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Oct 26, 2024 | 12:54 PM

POCO M6 5G: అమెజాన్ సేల్‌లో పకో ఎమ్6 ఫోన్‌పై మంచి ఆఫర్ లభిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 9,499కాగా 16 శాతం డిస్కౌంట్‌తో రూ. 7,999కి లభిస్తోంది. అలాగే పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 500 డిస్కౌంట్ లభిస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 50 ఎంపీతో కూడిన రెయిర్ కెమెరాను అందించారు.

Realme NARZO N61: రియల్ మీ నార్జో ఎన్61 స్మార్ట్ ఫోన్‌పై బెస్ట్ డీల్ లభిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 10,999కాగా సేల్‌లో భాగంగా రూ. 8,498కే సొంతం చేసుకోవచ్చు. అలాగే అమెజాన్ పే బ్యాలన్స్‌తో చెల్లిస్తే అదనంగా రూ. 250 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఐపీ54 డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌ను అందించారు. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.

Redmi 13C: రెడ్‌మీ 13సీ స్మార్ట్ ఫోన్‌పై మంచి సేల్ లభిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 13,999కాగా అమెజాన్ సేల్‌లో 39 శాతం డిస్కౌంట్‌తో రూ. 8499కి సొంతం చేసుకోవచ్చు. అలాగే పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 849 డిస్కౌంట్ పొందొచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 50 ఎంపీతో కూడిన ఏఐ ట్రిపుల్ కెమెరాను అందించారు.

Redmi A3X: రెడ్‌మీ ఏ3ఎక్స్ స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 9,999కాగా ప్రస్తుతం సేల్‌లో 33 శాతం డిస్కౌంట్‌తో రూ. 6650కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 90 హెచ్‌జెడ్ డిస్‌ప్లేను అందించారు.

TECNO POP 9 5G: రూ. 10వేలలో లభిస్తోన్న మరో బెస్ట్ ఫోన్ టెక్నో పాప్ 9 5జీ స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ అసలు ధర రూ. 12,999కాగా సేల్‌లో భాగంగా రూ. 9,999కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఇక ఇందులో 48 ఎంపీతో కూడిన రెయిర్ కెమెరాను ఇచ్చారు. డ్యూయల్ స్పీకర్‌తో వచ్చే ఈ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 999 డిస్కౌంట్ పొందొచ్చు.




