- Telugu News Photo Gallery Technology photos Amazon great indian festival huge discount on Samsung Galaxy A14 5G smart phone
Samsung: బ్రాండెడ్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ. 7 వేలకుపైగా తగ్గింపు..
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీవాళి స్పెషల్ సేల్‌లో భాగంగా కళ్లు చెదిరే సేల్స్ అందిస్తున్నాయి. ఈ సేల్‌లో భాగంగా పలు స్మార్ట్ పోన్స్‌పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ సామ్‌సంగ్ ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్ లభిస్తోంది. సామ్‌సంగ్ ఏ14 ఫోన్‌పై ఎలాంటి డిస్కౌంట్ లభిస్తోంది.? ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Oct 26, 2024 | 2:14 PM

అమెజాన్ సేల్‌లో భాగంగా సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ14 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్‌పై సుమారు రూ. 7 వేల వరకు తగ్గింపు ధర లభిస్తోంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత లాంటి వివరాలు మీకోసం.

సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ14 5జీ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.17,499కాగా అమెజాన్ సేల్‌లో భాగంగా 37 శాత డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 10,974కే సొంతం చేసుకోవచ్చు. అలాగే పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. వెయ్యి వరకు డిస్కౌంట్ లభించనుంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 10 వేలలోపే పొందొచ్చు.

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ14 స్మార్ట్ ఫోన్‌లో 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడి రెయిర్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. ర్యామ్‌ను 8 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 6.6 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 1080 X 2408 రిజల్యూషన్‌తో సినిమాటిక్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను పొందొచ్చు. ఈ ఫోన్‌పై కంపెనీ ఏడాది వారంటీని అందిస్తోంది.

ఇక బ్యాటరీ విషయనికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 5000 ఎమఏహెచ్ కెపాసిటీతో కూడిన శక్తివంతమైన బ్యాటరీని అందించారు. ఇక ఏఐ పవర్ మేనేజ్‌మెంట్‌ను ఇందులో ప్రత్యేకంగా అందించారు. 3.5 ఎమ్‌ఎమ్ ఆడియోజాక్‌ను ఇచ్చారు. బ్లూటూత్, వైఫై, యూఎస్‌బీ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.




