చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ హానర్ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. హానర్ ఎక్స్7బీ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు. స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.
6.8 ఇంచెస్‌తో కూడిన ఎల్సీడీ స్క్రీన్ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో అందించారు. ట్రిపుల్ కెమెరా సెటప్ ఈ ఫోన్ సొంతం. ఇక ఎమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.
ఈ స్మార్ట్ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 35 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.
ఎమరాల్డ్ గ్రీన్, ఫ్లోయింగ్ సిల్వర్, మిడ్ నైట్ బ్లాక్ కలర్స్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ప్రస్తుతం చైనా మార్కెట్లో అందులోబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఇక ఈ ఫోన్ ధర మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 20 వేల వరకు ఉండొచ్చని అంచనా.
ఇక కనెక్టివిటీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో.. 4జీ ఎల్టీఈ, డ్యుయల్ బాండ్ వై-పై, బ్లూటూత్ 5, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, 2.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.