HMD: మంచి ఫీచర్‌ ఫోన్‌ కోసం చూస్తున్నారా.? రూ. 2వేల ధరలో..

|

Sep 12, 2024 | 10:02 PM

ఓవైపు మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఫీచర్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఇటీవల జియో ఫీచర్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. 4జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్‌ చేసే ఫీచర్స్‌ ఫోన్స్‌కి ప్రస్తుతం మంచి డిమాండ్‌ ఉంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ హెచ్‌ఎండీ రెండు కొత్త ఫోన్‌లను లాంచ్‌ చేసింది. హెచ్‌ఎండీ 105, హెచ్‌ఎండీ 110 పేరుతో ఫోన్‌లను తీసుకొచ్చారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ హెచ్‌ఎండీ భారత మార్కెట్లోకి రెండు కొత్త ఫోన్‌లను తీసుకొచ్చారు. హెచ్‌ఎండీ 105, 110 పేర్లతో రెండు కొత్త ఫోన్‌లను తీసుకొచ్చారు. ఈ రెండు ఫోనలలో కూడా 1450 ఎమ్‌ఏహెచ్‌ వంటి బ్యాటరీని అందించారు. దీంతో పాటు మరెన్నో సూపర్ ఫీచర్లను అందించారు.

2 / 5
ధర విషయానికొస్తే హెచ్‌ఎండీ 105 4జీ ధర రూ. 2,199కాగా, హెచ్‌ఎండీ 110 4జీ ధర రూ. 2399గా నిర్ణయించారు. ఈ ఫోన్‌లను బ్లాక్, సియాన్, పింక్, టైటానియం,బ్లూ కలర్స్‌లో తీసుకొచ్చారు. ఈకామర్స్‌ సైట్స్‌తో పాటు హెచ్‌ఎండీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

3 / 5
ఈ ఫోన్‌తో ఏడాది రీప్లేస్‌మెంట్ గ్యారెంటీని అందిస్తోంది. ఇక ఈ ఫోన్ 23 భాషలు, 13 ఇన్‌పుట్ భాషలను సపోర్ట్ చేస్తుంది. క్లౌడ్ ఫోన్ యాప్ ద్వారా  యూట్యూబ్, యూట్యూబ్ మ్యూజిక్, యూట్యూబ్ షార్ట్‌లను వీక్షించవచ్చు.

4 / 5
ఈ ఫోన్‌లో ప్రీలోడెడ్‌ కూడా యూపీఐ పేమెంట్స్‌ యాప్‌ను అందిస్తోంది. ఫోన్‌లో MP3 ప్లేయర్, వైర్‌లెస్ FM రేడియో ఆప్షన్స్‌ను అందించారు. 32GB ఎస్డీ కార్డుకు ఈ పక్షన్‌ సపోర్ట్ చేస్తుంది.

5 / 5
ఫోన్‌ టాకర్‌ వంటి అధునాతన ఫీచర్‌ ఈ ఫోన్‌ సొంతం. ఇక ఈ ఫోన్‌ 23 భాషలు, 13 ఇన్‌పుట్ భాషలను సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చిన జియో ఫీచర్‌ ఫోన్‌లకు ఇది పోటీ ఇవ్వనున్నట్లు స్పష్టమవుతోంది.