
స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి అన్ని రకాల పనులకు యాప్‌లను ఉపయోగించడం సర్వసాధారణంగా మారిపోయింది.

అయితే ఈ యాప్‌లలో చాలా వరకు అవసరం లేనప్పుడు కూడా బ్యాగ్రౌండ్‌లో రన్ అవుతుంటాయి. దీని ద్వారా మొబైల్ డేటా త్వరగా అయిపోతుంటుంది.

అలా కాకుండా స్మార్ట్ ఫోన్‌లో ఉన్న కొన్ని ఆప్షన్లను ఉపయోగించుకోవడం ద్వారా డేటాను సేవ్ చేసుకునే అవకాశం ఉందని మీకు తెలుసా.? అలాంటి కొన్ని ఆప్షన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

'ఆండ్రాయిడ్ సెట్టింగ్స్'లో 'నెట్‌వర్క్ అండ్ ఇంటర్నెట్' అనే విభాగంలోకి వెళ్లి అందులో ఉండే 'Data Saver' అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుంటే డేటా కంప్రెస్ చేయడంతో.. డేటా వినియోగం తగ్గుతుంది.

అలాగే 'App Data Usage' అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవడంతో 'Background Data'ను డిజేబుల్ చేసుకోవడం ద్వారా మీరు ఎంచుకున్న యాప్‌నకు డేటా వినియోగానికి పరిమితి విధించవచ్చు.

ఇక కొన్ని ఫోన్లలో 'Unrestricted Data' అనే ఆప్షన్ లభిస్తుంది. దీనిని డిజేబుల్ చేసుకుంటే డేటా ఆదా చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇలా కొన్ని చిన్ని చిన్న ట్రిక్స్‌తో మొబైల్ డేటాను సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది.