- Telugu News Photo Gallery Technology photos Disappearing feature in whatsapp latest update in messaging app
WhatsApp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. ఇకపై చూడగానే మాయం కానున్న వీడియోలు/ఫొటోలు..
New Feature In WhatApp: కొత్త ప్రైవసీ పాలసీ తర్వాత వినియోగదారుల నమ్మకం కోల్పోయిన వాట్సాప్. ఇప్పుడు కొంగొత్త ఫీచర్లతో మళ్లీ యూజర్లను ఆకట్టుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా వరుసగా ఫీచర్లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే..
Updated on: Mar 05, 2021 | 8:06 AM

ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లో వాట్సాప్‌లో మొదటి వరుసలో ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.

అయితే ఇలాంటి పాపులర్ యాప్‌కి ఇటీవల ప్రైవసీ పాలసీతో కాస్త దెబ్బపడిందని చెప్పాలి. చాలా మంది ఈ యాప్‌ను డిలీట్ చేసుకొని ప్రత్నామ్నాయ యాప్‌లవైపు వెళ్లిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే మళ్లీ యూజర్లను తనవైపు తిప్పుకునే క్రమంలో వాట్సాప్ వరుసగా కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్.. 'మీడియా డిస్‌అప్పియరింగ్' అనే కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. దీంతో ఫొటోలు/వీడియోలు అవతలి వ్యక్తి చూడగానే డిలీట్ అయిపోతాయి.

ఇందుకోసం ఫొటో/వీడియోను షేర్ చేసే ముందు, యాడ్ కాప్షన్ అనే బాక్స్ పక్కన ఉండే గడియారం సింబల్‌ను టచ్ చేసి యాక్టివేట్ సరిపోతుంది. ఆ తర్వాత మీరు పంపిన ఫొటో/వీడియోను అవతలి వ్యక్తి చూశాక డిలీట్ అయిపోతుంది.

ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.




