Cheap Electric Car: బైక్‌ ధరలోనే కారు.. ప్రపంచంలోనే అత్యంత చవకైన ఈ ఎలక్ట్రిక్‌ కారుపై ఓ లుక్కేయండి.

|

Aug 31, 2021 | 1:47 PM

Cheap Electric Car: ఎలక్ట్రిక్‌ కారు కొనుగోలు చేయాలంటే కనీసం రూ. 4 లక్షలు పెట్టాల్సిందే కానీ.. చైనాకు చెందిన రీగల్ కాప్టర్‌ మోటార్స్‌ రూపొందించిన ఈ కారు ధర ఎంతో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. కేవలం రూ. లక్షన్నరలో ఉన్న ఈ కారు పూర్తి వివరాలు..

1 / 6
ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాల హవా నడుస్తోంది. అయితే విద్యుత్‌తో నడిచే కారును కొనుగోలు చేయాలంటే కనీసం రూ. 4 లక్షలు పెట్టాల్సిందే. అయితే రూ. లక్షన్నరలోనే కారు సొంతం చేసుకునే అవకాశం వస్తే భలే ఉంటుంది కదూ.!

2 / 6
చైనాకు చెందిన రీగల్‌ రాప్టర్‌ మోటార్స్‌ తయారు చేసిన K5 కారు ఇదే జాబితాలోకి వస్తుంది. ప్రస్తుతం చైనాలో ఈ కారు అమ్మకాలు మొదలయ్యాయి.

3 / 6
ముగ్గురు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించే ఈ కారులో ముందు ఒకరు, వెనకాల ఇద్దరు ప్రయాణించవచ్చు.

4 / 6
ఈ కారు గంటకు గరిష్టంగా 55 కి.మీల వేగంతో ప్రయాణిస్తుంది. ఒక్కసారి ఫుల్‌ చార్జ్‌ చేస్తే 55 నుంచి 66 కిమీలు దూసుకుపోతుంది.

5 / 6
 ఈ కారులో 12 * 38 బ్యాటరీతో శక్తినిస్తుంది, బ్యాటరీ ఒక్కసారి పూర్తిగా చార్జ్‌ కావడానికి 8 గంటల సమయం పడుతుంది.

6 / 6
 ప్రస్తుతం K5 కారు అలీబాబా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఈ కారు ధరను 2100 డాలర్లుగా నిర్ణయించారు. మన కరెన్సీలో చెప్పాలంటే కేవలం రూ. 1 లక్ష 53 వేలు మాత్రమే.